OG New Poster: ముంబైలో మారణహోమం - ‘ఓజీ’ కొత్త పోస్టర్ - ఫ్యాన్స్‌కు పవర్ ట్రీట్!
They Call Him OG Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దే కాల్ హిమ్ ఓజీ’ నుంచి ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
They Call Him OG New Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ దర్శకత్వంలో ‘దే కాల్ హిమ్ ఓజీ’ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. వీటిలో ఫ్యాన్స్ ఘోరంగా వెయిట్ చేస్తున్నది మాత్రం ‘ఓజీ’ గురించే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్‌లో కూడా ఫ్యాన్స్ ఓజీ, ఓజీ అని అరుస్తూనే ఉంటారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా పేలిపోతుంది. అలాంటిది పేలుళ్లతోనే ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు మేకర్స్.
ముంబైలో బ్లాస్ట్...
‘ఓజీ’ సినిమా ముంబై నేపథ్యంలో జరుగుతుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్‌ను బట్టి చెప్పేయచ్చు. ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్‌లో కూడా ఒకవైపు ముంబైలోని ఇండియా గేట్, మరోవైపు ఏదో బ్లాస్ట్ జరుగుతున్న విజువల్ చూపించారు. మధ్యలో పవన్ కళ్యాణ్ కారు మీద కటానా (మార్షల్ ఆర్టిస్ట్స్ ఉపయోగించే ప్రత్యేకమైన కత్తి) పట్టుకుని నిలుచున్నారు. పవన్ కళ్యాణ్ చీకటిలో నుంచుని ఉన్నారు. ఆయన ఫేస్ కూడా రివీల్ చేయలేదు.
పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్...
ఓజీ నుంచి చిన్న అప్‌డేట్ వస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పోస్టర్ వచ్చే సరికి సోషల్ మీడియా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టేకోవర్ చేశారు. ఎక్స్ / ట్విట్టర్ మొత్తం ఓజీ పోస్టర్ మేనియాలోనే ఉంది. ఈ హైప్‌ను బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ ఎప్పుడు రిలీజ్ అయినా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించే అవకాశం భిన్నంగా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూళ్ల పరంగా ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర: పార్ట్ 1’ టాప్-2 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న హైప్ ప్రకారం ‘ఓజీ’ కంఫర్టబుల్‌గా టాప్-2లోకి వచ్చేస్తుంది. అన్నీ సరిగ్గా వర్కవుట్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ లేచిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రిలీజ్ ఎప్పుడు?
ప్రస్తుతం ఫ్యాన్స్ ముందు ఉన్న మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇదే. ‘ఓజీ’ ఎప్పటికి విడుదల అవుతుంది అనే దానిపై బోలెడన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం మార్చి నెల ఆఖరి వారంలో ‘ఓజీ’ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ డేట్‌ను ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ తీసుకుంది. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి ‘ఓజీ’ 2025 ఆగస్టు 14వ తేదీన లేదా సెప్టెంబర్ 26వ తేదీన విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏ డేట్‌ను ‘ఓజీ’ టీమ్ లాక్ చేస్తుందో చూడాలి!
Read Also: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?