By: ABP Desam | Updated at : 07 Jun 2023 02:00 PM (IST)
నమ్రతా శిరోద్కర్ (Image Credits : Namrata Shirodkar/Instagram)
Namrata Shirodkar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత ఫ్యాషన్ జంటలలో ఒకరైన మహేష్ బాబు, నమ్రత ఇటీవల ఓ బేబీ షవర్ పార్టీకి హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించి పలు ఫొటోలను కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంలో వైరల్ కూడా అయ్యాయి. ఈ పార్టీలో నమ్రత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఆయన ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర పార్టీకి మహేష్ బాబు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టీ నమ్రత ధరించిన దుస్తులపైనే పడింది. ఆమె ధరించిన కుర్తా అందర్నీ ఆకర్షించింది. దీంతో ఆమె వేసుకున్న డ్రెస్సుకు సంబంధించిన వివరాలపై చాలా మంది ఆరా తీశారు. దాని ధర ఎంత, ఆ డ్రెస్సుపై ఎలాంటి డిజైన్ ఉంది అన్న విషయాలపై నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు.
నమ్రత ఈ పార్టీలో ప్రత్యేకంగా ధరించిన కుర్తా ధరపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గ్రాఫిక్ డిజైన్ తో కూడిన ఈ కుర్తా ధర దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో నమ్రత లాంగ్ స్లీవ్ లు, మిడ్ లెంగ్త్ తో కూడిన సొగసైన సిల్క్ కుర్తాను ధరించారు. దాంతో పాటు స్ట్రెయిట్ హెయిర్, మినిమల్ మేకప్, డైమండ్ చెవి పోగులు ఆమె రూపాన్నే మార్చి వేశాయి.
ఇక మహేష్ బాబు నేవీ బ్లూ టీ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ తో సింపుల్ గా కనిపించాడు. సితార ఈ పార్టీలో పింక్ డ్రెస్సులో మెరిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'గుంటూరు కారం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా వ్యాపారవేత్త అనిందిత్ రెడ్డితో జూలై 6, 2018లో శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అప్పట్లో ఈ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అప్పటికే శ్రియా భూపాల్... అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో వీరి వివాహానికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే శ్రీయ భూపాల్ పెళ్లికి ఉపాసన , రాంచరణ్ దంపతులు కూడా హాజరైన విషయం తెలిసిందే. గతంలో అఖిల్ అక్కినేని శ్రియ భూపాల్ నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అఖిల్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే పెట్టారు. ఆయన మళ్లీ పెళ్లి అనే ఊసే ఎత్తలేదు. కానీ శ్రీయ భూపాల్ మాత్రం ఇప్పుడు వివాహం చేసుకొని తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also : 'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?
మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Telugu 7: పవర్ అస్త్రాలు మటాష్, కెప్టెన్సీ టాస్క్ షురూ - ‘ఏం మనుషులు అయ్యా’ అంటూ శివాజీ ఆగ్రహం
Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
/body>