అన్వేషించండి

Prabhas: పిక్ ఆఫ్ ది డే - 'సలార్' సెట్స్ లో ప్రభాస్, టీమ్ స్పెషల్ విషెస్!

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 'సలార్' టీమ్ ప్రభాస్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫొటో షేర్ చేసింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 
 
ఇదిలా ఉండగా.. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి ఒక్కో అప్డేట్ బయటకొస్తుంది. 'ప్రాజెక్ట్ K' నుంచి, 'ఆదిపురుష్' టీమ్ నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. 'సలార్' టీమ్ కూడా ప్రభాస్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫొటో షేర్ చేసింది. 'సలార్' సెట్స్ లో ప్రభాస్ నిల్చొని ఉన్న ఫొటో అది. సైడ్ యాంగిల్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. హోంబేలె ఫిలిమ్స్ కూడా సెట్స్ లో ఒక ఫొటో షేర్ చేసింది. 
 
ఇప్పుడు ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ని 'రా' లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. 'సలార్' టీమ్ ప్రభాస్ ని విష్ చేస్తూ.. వయిలెంట్ మ్యాన్ అని పిలవడం చూస్తుంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా వయిలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. 

సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది.
 
'సలార్'లో 'అఖండ' షేడ్స్: 
ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. రీసెంట్ గా అతడికి సంబంధించిన లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 'అఖండ' షేడ్స్ ఉంటాయట. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో అఘోరా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విలన్స్ ను వెంటాడి మరీ చంపుతుంది అఘోరా క్యారెక్టర్.

'సలార్' సినిమాలో కూడా ఇలాంటి కొంతమంది భక్తులు కనిపిస్తారట. కాళీ మాతను కొలిచే కొందరు భక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వారితో పోరాటానికి దిగుతాడు సలార్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. కాళీ మాత టెంపుల్ సెట్ ను నిర్మించి అందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అని చెబుతున్నారు. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget