Pathaan: ‘పఠాన్’ కోసం షారుఖ్, దీపికా పదుకొనే ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
చాలా గ్యాప్ తర్వాత ‘పఠాన్’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు షారుఖ్ ఖాన్. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు గాను ఆయన భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నారు.
2023లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ‘పఠాన్’. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ఈ సినిమా రూ. 250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేసింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఓ ఉగ్ర సంస్థ భారత్ మీద అణు దాడికి ప్లాన్ చేసినప్పుడు, తన దేశాన్ని కాపాడుకునేందుకు ఓ సైనికుడు చేసే పోరాటమే ఈ సినిమాలోని కథ. ఈ మిషన్ లో పాల్గొనే షారుఖ్ చుట్టూ కథంతా తిరుగుతుంది. సదరు ఉగ్రవాద సంస్థకు జాన్ అబ్రహం నాయకత్వం వహిస్తాడు. అతడు చేసే అణు దాడి ప్లాన్ ను షారుఖ్ ఎలా తిప్పికొట్టాడు అనేదే స్టోరీ. ఇక ఈ సినిమాలో నటనకు గాను ఆయా నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇంతకీ ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపికా పదుకొనే
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులు దీపికా పదుకొణె ఒకరు. ఈమె ప్రతి సినిమాకు రూ. 10 కోట్లకు పైనే తీసుకుంటుంది. ఇక ‘పఠాన్’ సినిమాకు గాను తను ఏకంగా రూ. 15 కోట్లు వసూలు చేసింది. ఉగ్రవాద సంస్థ అణుదాడిని తిప్పికొట్టడంలో ‘పఠాన్’కు సాయం చేసే RAW ఏజెంట్ పాత్రను పదుకొణె పోషించింది. పదుకొణె కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. ఈ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
జాన్ అబ్రహం
ఈ సినిమాలో జాన్ అబ్రహం పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ పోషించాడు. ఉగ్రవాద సంస్థను తనే లీడ్ చేస్తుంటాడు. భారత్ పై అణుదాడికి ఫ్లాన్ చేస్తాడు. ఈ సినిమాకు గాను తను రూ. 20 కోట్లు తీసుకున్నాడు.
సిద్ధార్థ్ ఆనంద్
‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్!’, ‘బచ్నా ఏ హసీనో’ సహా పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోగా, దర్శకుడు ఆనంద్ సైతం రూ.6 కోట్లు అందుకున్నారు.
షారుఖ్ ఖాన్
చాలా గ్యాప్ తర్వాత ‘పఠాన్’తో వెండితెరపై ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అదుర్స్ అనిపించారు. భారత్ పై న్యూక్లియర్ దాడిని ఎదుర్కొనేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో నటనకు గాను షారుఖ్ ఏకంగా రూ. 100 కోట్లు తీసుకున్నారు. ఆయన కెరీర్ లో తీసుకున్న అతి పెద్ద రెమ్యునరేషన్ ఇదే కావడం విశేషం.
It's #Pathaan ki Party, and you better not miss it!
— Yash Raj Films (@yrf) January 26, 2023
Experience this visual spectacle ONLY in cinemas now - https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/NhuHVRWSW5
Read Also: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్