Konda Polam: కొండపొలం: 45 రోజులు అడవుల్లోనే.. క్రిష్ ఏడ్చేశారు: రకుల్ ప్రీత్ సింగ్
‘కొండపొలం’ సినిమా గురించి వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన విశేషాలివే.
‘కొండపొలం’.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ అద్భుత దృశ్యకావ్యం త్వరలోనే ఈ నెల 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి.
ఈ చిత్రంలో ఓబు క్యారెక్టర్ క్రిష్ సృష్టి: వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను తలపాగా, గొర్రెలతో ఉన్న నా లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. రెండో సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో మేం మాట్లాడే యాస కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ‘కొండపొలం’ యాక్షన్, అడ్వేంచర్, లవ్‌తోపాటు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. రకుల్ చాలా ఫాస్ట్‌గా తన సీన్ పూర్తి చేసెసేది. ఆమెను చూసి నేను ఎలా చేయాలా అని భయపడేవాడిని. ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తనకు తెలుగు సరిగా రాకపోయినా.. ఆ స్లాంగ్‌లో మాట్లాడటం చాలా గ్రేట్. కష్టమైన పదాలను కూడా ఆమె నేర్చుకొని చెప్పేది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కొండపొలం రాసిన నవల ఆధారంగా క్రిష్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ కథను సినిమాకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఓబులమ్మ పాత్ర లేదు. క్రిష్ దాన్ని క్రియేట్ చేశారు. లాక్‌డౌన్‌లో మొత్తమంతా సిద్ధం చేశారు. దానివల్ల వేగంగా షూటింగ్ పూర్తయ్యింది. అడవుల్లోకి వెళ్లేందుకు చిత్రయూనిట్ చాలా కష్టపడ్డారు. పెద్ద పెద్ద లైట్లను మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని’’ అని తెలిపాడు.
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
45 రోజులు అడవుల్లోనే..: ‘‘ఇదివరకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించాను. కానీ, ఇది చాలా భిన్నమైన పాత్ర. ఇందులో నేను మేకలను చూడాలి. కొండపొలం తరహా పాత్రను నేను ఎన్నడూ చూడలేదు. గొర్రెల కాపిరి కుటుంబాల్లో అమ్మాయిలు ఏ విధంగా ఉంటారనేది వీడియోలను చూసి తెలుసుకున్నా. గొర్రెలు కాయడం కూడా నేర్చుకున్నాను. షూటింగ్ ఉన్నా, లేకపోయినా గొర్రెలను కాపలా కాశాను. ఈ చిత్రం అడ్వేంచర్ డ్రామా. గొర్రెల కాపరుల జీవితాన్ని క్రిష్ తెరపై ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమా కథ గురించి క్రిష్ చెబుతూ.. ‘కొండపొలం’ నవల చూసి ఏడ్చేశానని తెలిపారు. అందుకే దాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నానని పేర్కొన్నారు. రాత్రివేళ్లలో అడవుల్లో షూటింగ్ చేయడానికి అనుమతి లేదు. తెల్లవారుజాము లైటింగ్‌లోనే రాత్రి సీన్లు చిత్రీకరించారు. కీరవాణి చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. నన్ను డేట్స్ అడిగే సమయానికే క్రిష్ మొత్తం ప్రాజెక్ట్ రెడీ చేశారు. సినిమా కథ చెప్పగానే అంగీకరించాను. ఆగస్ట్ 21న షూటింగ్ స్టార్ట్ చేశారు. అడవుల్లో సుమారు 45 రోజులు శ్రమించి షూటింగ్ పూర్తి చేశాం’’ అని రకుల్ తెలిపింది.
Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్