Gangs Of Godavari OTT: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ - థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే...
Gangs Of Godavari OTT Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. అది ఎప్పుడో చూడండి.
Netflix announced the OTT release of Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. లిరిసిస్ట్ నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాకింగ్ ఏమిటంటే... అతి త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
ఓటీటీలోకి జూన్ 14న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'!
Gangs Of Godavari OTT Release Date Netflix Telugu: జూన్ 14వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. థియేటర్లలోకి విడుదలైన రెండు వారాలకు డిజిటల్ రిలీజుకు సినిమా రావడం షాక్ అని చెప్పాలి. బాక్సాఫీస్ బరిలో ఆశించిన విజయం రాకపోవడంతో రెండు వారాల వ్యవధిలో ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. థియేటర్లలో తెలుగులో మాత్రమే విడుదల చేయగా... ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?
View this post on Instagram
ఓపెనింగ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చినా...
Gangs Of Godavari collection: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో విడుదలైన మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 16.2 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అనౌన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత సినిమాకు ఆశించిన కలెక్షన్స్ రాలేదట.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా
#GangsOfGodavari had a BLOCKBUSTER weekend at the box-office, grossed over 𝟏𝟔.𝟐 𝐂𝐑 in 3 Days! 💥🔥
— Sithara Entertainments (@SitharaEnts) June 3, 2024
Reignited the charm of the Single Screens! 💥
Don't miss 𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒 @VishwakSenActor 𝐑𝐀𝐌𝐏𝐀𝐆𝐄 at theatres near you! 💥🤩
Book your tickets now 🎟️ -… pic.twitter.com/NVnzvHv0km
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని తెరకెక్కించాయి. 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ' తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి కో ప్రొడ్యూసర్లు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
విశ్వక్ జోడీగా నేహా శెట్టి... వేశ్యగా అంజలి!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు నేహా శెట్టి... మరొకరు తెలుగమ్మాయి అంజలి. విశ్వక్ జోడీగా నేహా శెట్టి కనిపించగా... హీరో ప్రాణాల మీదకు వచ్చిన సమయంలో అండగా నిలబడే మహిళగా, వేశ్య పాత్రలో అంజలి నటించారు. 'మోత మోగిపోద్ది' పాటలో ఆయేషా ఖాన్ స్టెప్పులు వేశారు. గోపరాజు రమణ, సాయి కుమార్, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.