విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా కృష్ణచైతన్య తీసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ప్లస్, మైనస్ పాయింట్స్... 

కథ: 'లంకల' రత్న (విశ్వక్ సేన్) అనాథ. వేశ్య రత్నమాల (అంజలి)కు క్లోజ్. అదీ ఆమె దగ్గర డబ్బులు కొట్టేసేంత!

పైకి ఎదగడం కోసం ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) దగ్గర నానా పనులు చేసి అతడి దృష్టిలో పడతాడు. 

నానాజీ (నాజర్) అండతో ఎమ్మెల్యేకు ఎదురుతిరిగి అతడి మీద ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డాడు?

నానాజీ కుమార్తె బుజ్జి (నేహా శెట్టి)తో రత్న ప్రేమ ఏమిటి? సొంత మనుషులే అతడ్ని ఎందుకు చంపాలనుకున్నారు? 

విశ్లేషణ: గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ రొటీన్ యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.

సినిమాలో రణరంగం, నేనే రాజు నేనే మంత్రి ఛాయలు కనిపిస్తాయి. కృష్ణ చైతన్య కథలో కొత్తదనం లేదు.

ఫస్టాఫ్‌లో కామెడీ, ట్విస్ట్ అండ్ టర్నులతో సరదాగా సాగింది. సెకండాఫ్ మరీ డల్. దాంతో బోర్ కొడుతుంది.

విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్, ఆయన నటన బావుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కూడా సూపర్బ్.

టైమ్ పాస్ కోసం, రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ చూడాలని అనుకుంటే మూవీకి వెళ్లండి. లేదంటే లైట్.