రఫా మీద ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ హీరోయిన్లు All Eyes On Rafah పోస్టర్ షేర్ చేశారు. వాళ్లెవరో చూడండి

రఫాపై భీభత్సాన్ని మాటల్లో వర్ణించలేం. భూమ్మీద సురక్షితమైన ప్రాంతం ఎక్కడా లేదు. ఈ యుద్ధం ఆగిపోవాలి - సమంత

యూనిసెఫ్ పోస్ట్ షేర్ చేసిన కరీనా రఫాకు తన మద్దతు తెలిపారు. చిన్నారులపై దమనకాండ ఆగాలన్నారు. 

చిన్నారులకు ప్రేమ, శాంతి, రక్షణ, మంచి జీవితం ఇవ్వగల అర్హత తల్లులకు ఉండాలని అలియా భట్ పేర్కొన్నారు. 

రఫా వీడియోలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని రాధికా ఆప్టే పేర్కొన్నారు. తనకు మాటలు రావడం లేదన్నారు. 

అమాయక ప్రజలపై మారణహోమం జరుగుతోందని, ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలని అమీ జాక్సన్ పేర్కొన్నారు.

చిన్నారులపై శరణార్థి శిబిరాల్లో జరుగుతున్న మరణహోమంపై ప్రతి ఒక్కరూ స్పందించాలి - స్వరా భాస్కర్

రఫాలో చిన్నారులపై మారణహోమం చూశా. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అని ఫాతిమా సనా షైక్ ప్రశ్నంచారు.

రఫాలో శరణార్థులపై వీడియోలు షేర్ చేసిన దియా మీర్జా... గాజాలో పరిస్థితులను లైవ్ ఇవ్వాలన్నారు. 

సోనమ్ కపూర్, వరుణ్ ధావన్, ప్రియాంక చోప్రా సహా పలువురు all yes to rafah పోస్టర్ చేశారు.