Kaatera OTT: ‘సలార్’కు చెమటలు పట్టించిన కన్నడ మూవీ ‘కాటేరా’.. ఇప్పుడు ఓటీటీలోకి - తెలుగులోనూ స్ట్రీమింగ్
Kaatera OTT: ‘సలార్’కు పోటీ ఇస్తూ థియేటర్లలో విడుదలయిన ‘కాటేరా’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్ బయటికొచ్చింది. త్వరలోనే జీ5లో ఈ మూవీ విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది.
Kaatera OTT Release Update: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ మూవీ విడుదలయ్యింది. అన్ని భాషల్లో ఈ సినిమా సత్తాను చాటుకున్నా.. కన్నడలో మాత్రం కాస్త వెనకబడింది. దానికి కారణమే ‘కాటేరా’. కన్నడ స్టార్ హీరో దర్శన్ లీడ్ రోల్‌లో నటించిన ‘కాటేరా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ‘సలార్’ను కూడా బీట్ చేసి మరీ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అయ్యే సమయం వచ్చేసింది. తాజాగా ‘కాటేరా’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
కన్నడతో పాటు ఇతర భాషల్లో..
‘కాటేరా’ మూవీ థియేటర్లలో విడుదలయ్యి రెండు వారాలు అయ్యింది. ఇప్పటికీ కర్ణాటక బాక్సాఫీస్‌లో ఈ మూవీ సత్తా చాటుకుంటోంది. ఇంతలోనే ‘కాటేరా’ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తంతో జీ5 సొంతం చేసుకుందని సమాచారం. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో కూడా ఈ మూవీ జీ5 సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ‘కాటేరా’ ఓటీటీ రిలీజ్ గురించి మూవీ టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా.. ఫిబ్రవరీ 9 నుండి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. దర్శన్ ఫ్యాన్స్ అంతా ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
డబుల్ లాభాలు..
1970 బ్యాక్‌డ్రాప్‌లోని కథతో తెరకెక్కిన చిత్రమే ‘కాటేరా’. ఈ మూవీ పూర్తిస్థాయి యాక్షన్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీ బడ్జెట్ రూ.45 కోట్లే అయినా.. రూ. 105 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. డిసెంబర్ 29న విడుదలయిన ఈ సినిమా.. ఇప్పటికీ పలు థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. తమ అభిమాన హీరో దర్శన్ కోసం మూవీని మళ్లీ మళ్లీ చూస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు శాండిల్‌వుడ్‌లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి దర్శకుడు తెరకెక్కించిన సినిమానే వెనక్కి నెట్టింది ‘కాటేరా’.
మాలాశ్రీ కూతురి గ్రాండ్ డెబ్యూ..
‘కాటేరా’తో శాండిల్‌వుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమయ్యింది సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు రాధనా రామ్. దర్శన్‌లాంటి స్టార్ హీరోతో డెబ్యూ చేసే అవకాశం దక్కడంతో పాటు తన క్యారెక్టర్‌కు చాలా యాక్టింగ్ చేసే స్కోప్ లభించడంతో రాధనా రామ్‌పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పల్లెటూరి పిల్ల పాత్రలో కనిపించి.. తన నటనతో ఆకట్టుకుంది రాధనా రామ్. ప్రభావతి పాత్రలో తన నటన అద్భుతంగా ఉందని, ఇలాగే కొనసాగిస్తే.. తనకు కన్నడలో మంచి అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. అంతే కాకుండా రాధనా ఇలాగే కొనసాగిస్తే.. తన తల్లి మాలశ్రీలాగా తను కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?