అన్వేషించండి

Mirzapur3: ‘మీర్జాపూర్‌ 3’ వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Mirzapur3: క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘మీర్జాపూర్‌’ వెబ్ సిరీస్ నుంచి ముచ్చటగా మూడో సీజన్ ప్రేక్షకులను అలరించబోతోంది. త్వరలో ‘మీర్జాపూర్‌ 3’ విడుదలకు రెడీ అవుతోంది.

‘Mirzapur 3’ Release Date: ‘మీర్జాపూర్‌’. ఓటీటీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ పేరు కచ్చితంగా తెలిసే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించిన ఈ వెబ్‌సిరీస్ కు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. 2018లో వచ్చిన మీర్జాపూర్ తొలి సీజన్ రికార్డ్ వ్యూస్ తో అదరగొట్టింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఓ రేంజిలో క్రేజ్ దక్కింది. తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. ‘మీర్జాపూర్ 2’ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. తొలి సిరీస్ మించి ఆదరణ దక్కించుకుంది. 

త్వరలో ‘మీర్జాపూర్ 3’ విడుదల!

ఇప్పటికే ‘మీర్జాపూర్’ రెండు సిరీస్ లు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడంతో ముచ్చటగా మూడో సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తాజాగా ఓ కిక్ ఇచ్చే న్యూస్ అందింది. క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూడో భాగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడుస్తోంది.  ఏడాది క్రితమే మూడో సీజన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ పనులు కంప్లీట్ కాగానే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

2018లో ‘మీర్జాపూర్’ తొలి సిరీస్ విడుదల 

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందింది.  ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ కేంద్రంగా తెరకెక్కిన ఈ  సిరీస్ తొలి సీజన్  2018 నవంబరు 16న రిలీజ్ అయ్యింది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి కంట్యూనేషన్ గా  2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదల అయ్యింది. ‘మీర్జాపూర్ 2’ కూడా మంచి హిట్ అందుకుంది.

తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. త్వరలో రాబోయే మూడో సీజన్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ‘మీర్జాపూర్ 3’ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also : ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న మెగాస్టార్, ‘అంజి’ మూవీ కోసం చిరంజీవిని కోడి రామకృష్ణ అంత కష్టపెట్టారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today May 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం గురించి ఆలోచించిన అమర్‌ - మనోహరిని బెదిరించిన చంభా  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం గురించి ఆలోచించిన అమర్‌ - మనోహరిని బెదిరించిన చంభా  
Brahmamudi Serial Today May 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను కలిసిన ఆంటోని – అయోమయంలో శృతి
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను కలిసిన ఆంటోని – అయోమయంలో శృతి
Dragon Glimpse vs Peddi Trailer: డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
Karthika Deepam 2 Serial Today May 20th: కార్తీకదీపం సీరియల్: దీప, జ్యోత్స్నలకు మొదలైన పోటీ! సూరజ్ పట్ల దారుణంగా ప్రవర్తించిన జ్యో! నడిరోడ్డు మీదే అంతా నాశనం!
కార్తీకదీపం సీరియల్: దీప, జ్యోత్స్నలకు మొదలైన పోటీ! సూరజ్ పట్ల దారుణంగా ప్రవర్తించిన జ్యో! నడిరోడ్డు మీదే అంతా నాశనం!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Dragon Glimpse vs Peddi Trailer: డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Petrol Price Today:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి!
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి!
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!
Thalapathy Vijay CM: రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
Embed widget