Kodi Ramakrishna: ఒకే డ్రెస్ రెండేళ్లు వేసుకున్న మెగాస్టార్, ‘అంజి’ మూవీ కోసం చిరంజీవిని కోడి రామకృష్ణ అంత కష్టపెట్టారా?
Kodi Ramakrishna: చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘అంజి’. తాజాగా ఈ సినిమా విడుదలై 20 ఏండ్లు పూర్తి చేసుకుంది.
Kodi Ramakrishna About Anji Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘అంజి’. భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్ కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు.
ఒకే షర్ట్ 2 సంవత్సరాలు వేసుకున్నారు- కోడి రామకృష్ణ
‘అంజి’ సినిమాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పట్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని దర్శకుడు కోడి రామకృష్ణ తెలిపారు. “ఈ సినిమా కోసం చాలా మంది ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం కోసం చిరంజీవి ఎన్ని రోజులైనా కష్టపడి పని చేస్తానని చెప్పారు. కొత్త ఆర్టిస్టు మాదిరిగానే కష్టపడ్డారు కూడా. సినిమా మొత్తం ఆయన ఎంతో ఓపికగా నటించారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఒక షర్ట్ ను రెండు సంవత్సరాల పాటు వేసుకున్నాడు. గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వారు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే షర్ట్ ను వేసుకున్నారు. సినిమా పట్ల ఆయనకు అంత డెడికేషన్ ఉండేది” అని వెల్లడించారు.
Kodi Rama Krishna Garu About MEGA STAR ⭐@KChiruTweets Garu Dedication Levels & Commitment In #Anji Movie🔥
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) January 15, 2024
Never Seen Such An Artist Like #Chiranjeevi Garu🔥
Climax Shot 2 years chasem - entho kastam ina ade shirt 2yrs Veskunnaru #20YearsForAnji pic.twitter.com/R36uZ83pn8
షూటింగ్ కోసం 5 ఏండ్ల సమయం పట్టింది- కోడి రామకృష్ణ
ఇక ‘అంజి’ సినిమా ఇంటర్వెల్ సీన్ నెల రోజుల పాటు షూట్ చేసినట్లు చెప్పారు. “ఇంటర్వెల్ సీన్ నెల రోజులు షూట్ చేశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. స్టోరీ విషయంలో చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగ బాబును పెద్దన్నయ్య అనే క్యారెక్టర్ చేయించాం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంత కష్ట పడ్డామో, ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. ఈ సినిమాలో ఒక్కో సీన్ కోసం వందకు పైగా షాట్స్ తీసేవాళ్లం. అంతలా షూట్ చేయాల్సి వచ్చింది కాబట్టే 5 సంవత్సరాలు షూట్ చేశాం. ఈ సినిమా సంబంధించిన గ్రాఫిక్స్ పనులు సింగపూర్, మలేషియా, అమెరికాలో చేయించాం” అని వెల్లడించారు. ‘అంజి’ సినిమా అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా చెప్పుకొవచ్చు. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా, మేం ఈ సినిమా కోసం పడిన తపన ఎలాంటిది అనేది ఇండస్ట్రీలో వాళ్లు అందరికీ తెలుసు’’అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.
Read Also: తెలుగు ఓటీటీలోకి ‘లిటిల్ మిస్ నైనా’గా వస్తున్న మలయాళీ రొమాంటిక్ డ్రామా