This Week Telugu Movies: సూపర్ అడ్వెంచర్ 'మిరాయ్' To క్రైమ్ థ్రిల్లర్ 'టన్నెల్' - ఈ వారం థియేటర్స్, ఓటీటీట్లో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే
Upcoming Telugu Movies: సూపర్ అడ్వెంచర్ 'మిరాయ్' నుంచి హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' వరకూ ఈ వారం థియేటర్స్‌లో మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పాటే ఓటీటీల్లోకి హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Upcoming Telugu Movies In Theaters OTT Releases In September 2nd Week 2025: ఈ సెప్టెంబర్ మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే. ఈ వారం సూపర్ అడ్వెంచర్ మూవీస్‌తో పాటు హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అటు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...
తేజ సజ్జా 'మిరాయ్'
'హను మాన్' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మరో సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా... మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు. మానవాళికి మేలు చేసే అశోకుని దగ్గర ఉన్న 9 గ్రంథాలను కాపాడే సూపర్ హీరో, వాటిని చేజిక్కించుకోవాలనే ప్రయత్నించే విలన్ మధ్య సాగే స్టోరీయే మిరాయ్. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి'
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి'తో రాబోతున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నెల 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... పిల్లలు, గుండె ధైర్యం లేని వారు మూవీకి దూరంగా ఉండాలని టీం తెలిపింది.
క్రైమ్ థ్రిల్లర్ 'టన్నెల్'
'టన్నెల్' అనే డిఫరెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అథర్వ మురళీ హీరోగా చేస్తుండగా... లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేస్తున్నారు. రవీంద్ర మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో ఎ.రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. క్రూరమైన గ్యాంగ్, సైకోతో ఓ పోలీస్ చేసిన పోరాటమే బ్యాక్ డ్రాప్‌గా మూవీని రూపొందించారు.
Also Read: 'ఢీ' షో To బిగ్ బాస్ హౌస్ - ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
ఓటీటీల్లో వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
- సెప్టెంబర్ 8 - టాస్క్ (ఇంగ్లీష్ మూవీ - జియో హాట్ స్టార్), ది వెడ్డింగ్ బాంకెట్ (ఇంగ్లిష్ మూవీ - Paramount)
- సెప్టెంబర్ 9 - సు ఫ్రమ్ సో (జియో హాట్ స్టార్), ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ - జియో హాట్ స్టార్), హనీ డాంట్ (ప్రైమ్ వీడియో), తటామి (ప్రైమ్ వీడియో), వెపన్స్ (ప్రైమ్ వీడియో), కిస్ ఆర్ డై (జపనీస్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)
- సెప్టెంబర్ 10 - సీన్ అండ్ హెర్డ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జియో హాట్ స్టార్), ఆక చార్లీ షీన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - నెట్ ఫ్లిక్స్), వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ప్రైమ్ వీడియో), ది డెడ్ గర్ల్స్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ది గర్ల్ ఫ్రెండ్ (వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో)
- సెప్టెంబర్ 11 - కూలీ (ప్రైమ్ వీడియో)
- సెప్టెంబర్ 12 - బకాసుర రెస్టారెంట్ (సన్ నెక్స్ట్), మీషా (సన్ నెక్స్ట్), రాంబో ఇన్ లవ్ (జియో హాట్ స్టార్), డిటెక్టివ్ ఉజ్వలన్ (లయన్స్ గేట్ ప్లే), డు యూ వాన్నా పార్ట్‌నర్ (హిందీ సిరీస్ - ప్రైమ్ వీడియో), ది రాంగ్ పారిస్ (నెట్ ఫ్లిక్స్), వార్ ఫేర్ (HBO Max), స్క్రీమ్ బోట్ (ప్రైమ్ వీడియో), యు అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ (కొరియన్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), రాటు రాటు క్వీన్స్ (నెట్ ఫ్లిక్స్), సైయారా (నెట్ ఫ్లిక్స్)
- సెప్టెంబర్ 13 - మెటీరియలిస్ట్స్ (నెట్ ఫ్లిక్స్), లాస్ట్ ఇన్ ది జంగిల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - డిస్నీ ప్లస్)





















