Rajinikanth Kamal Haasan : ఇట్స్ అఫీషియల్ - 46 ఏళ్ల తర్వాత కమల్ రజినీకాంత్ మల్టీ స్టారర్ మూవీ... థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమే
Kamal Haasan: దాదారు 46 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై హిట్ కాంబో రిపీట్ కానుంది. గత కొంతకాలంగా వస్తోన్న వార్తలు నిజమేనంటూ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా కన్ఫర్మ్ చేశారు.

Kamal Haasan About Movie With Rajinikanth: అటు తలైవా రజినీకాంత్, ఇటు యూనివర్సల్ హీరో కమల్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా సూపర్ న్యూస్. వీరిద్దరి కాంబోలో ఓ మల్టీస్టారర్ రాబోతోందని గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కమల్. తాను రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్నట్లు చెప్పారు.
ఇట్స్ బిగ్ సర్‌ప్రైజ్
'మీరు, రజినీకాంత్ కాంబో మల్టీ స్టారర్ ఆశించవచ్చా?' అంటూ ఎదురైన ప్రశ్నకు కమల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. 'ఆడియన్స్ మా కాంబోను ఇష్టపడితే అది చాలా మంచిదే. మేమిద్దరం కలిసి ఓ మూవీలో నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని రోజులూ అది కుదరలేదు. త్వరలోనే ఓ మల్టీస్టారర్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఈ మూవీ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది' అంటూ చెప్పారు. అయితే, డైరెక్టర్ ఎవరు ఏ బ్యాక్ డ్రాప్‌లో మూవీ ఉంటుంది అనే వివరాలను ఆయన షేర్ చేసుకోలేదు.
అవి మీరు సృష్టించినవే
తమ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్న వార్తలపైనా కమల్ రియాక్ట్ అయ్యారు. తమ ఇద్దరి మధ్య కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని... అవన్నీ మీరు సృష్టించుకున్నవే అని అన్నారు. 'మేం ఇద్దరం ఎప్పుడూ ఒకరికి ఒకరం పోటీ అని అనుకోలేదు. మూవీస్‌లో కలిసి నటించేందుకు ఛాన్సెస్ కోసం ఎదురుచూశాం. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలని కూడా ప్రయత్నించాం.' అంటూ తెలిపారు.
46 ఏళ్ల తర్వాత...
దాదాపు 46 ఏళ్ల తర్వాత వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సూపర్ స్టార్లతో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఆయన తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా శాసించారో? అనేదే ప్రధానాంశంగా ఉండనుంది. ఈ మూవీ ఎప్పుడో ట్రాక్ ఎక్కాల్సి ఉన్నా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
1970 ఆ టైంలో రజినీ కాంత్, కమల్ కలిసి మూవీస్ చేశారు. దాదాపు 5 భాషల్లో 20కి పైగా సినిమాల్లో నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అల్ఖూత విలక్కంలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మల్టీ స్టారర్ గ్యాంగ్ స్టర్ డ్రామాతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా 'కూలీ' మూవీతో సక్సెస్ అందుకున్నారు రజినీకాంత్. ఇక కమల్ లాస్ట్‌గా 'థగ్ లైఫ్' మూవీలో నటించగా ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.






















