Ghaati Collections: ఫస్ట్ వీకెండ్ ఐదు కోట్లు కూడా రాలేదు... బాక్సాఫీస్‌లో అనుష్క సినిమాకు చుక్కలు... మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Ghaati Box Office Collection Day 3: ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి అనుష్క శెట్టి 'ఘాటీ' సినిమాకు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదు. మూడు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

Ghaati 3 Days Collection: 'ఘాటీ' టీజర్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. క్వీన్ అనుష్క శెట్టిని అటువంటి యాక్షన్ రోల్‌లో చూసి సర్‌ప్రైజ్ అయ్యారంతా. మూవీ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగాయ్. ట్రైలర్, రిలీజ్ గ్లింప్స్ కూడా హైప్ ఇచ్చాయ్. మొదటి రోజు మొదటి కలెక్షన్స్ ఐదు కోట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. కట్ చేస్తే... మూడు రోజుల్లో కూడా ఆ మార్క్ చేరుకోలేదు.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఐదు కోట్ల లోపే!
Ghaati First Weekend Collection: బాక్స్ ఆఫీస్ బరిలో 'ఘాటీ'కి చుక్కలు కనిపిస్తున్నాయ్. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి ఈ సినిమా కష్టాలు పడుతోంది. మూడు రోజుల్లో కనీసం ఐదు కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
'ఘాటీ'కి మొదటి రోజు రెండు కోట్ల నెట్ కలెక్షన్ రాగా... రెండో రోజు కోటిన్నర కలెక్ట్ చేసింది. ఒక మూడో రోజు కేవలం కోటి కంటే కాస్త ఎక్కువ కలెక్ట్ చేసిందంతే! ఫస్ట్ సండే 'ఘాటీ' కలెక్షన్లు రూ. 1.15 కోట్లు మాత్రమే అని టాక్. ఫస్ట్ వీకెండ్ టోటల్... అంటే థియేటర్లలో విడుదలైన మూడు రోజుల్లో 'ఘాటీ' సినిమాకు 4.89 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్నాయి.
టోటల్ రన్‌లో పది కోట్లు కలెక్ట్ చేస్తుందా?ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి ఐదు కోట్ల మార్క్ చేరుకోవడంలో 'ఘాటీ' కష్టపడింది. ఈ నేపథ్యంలో టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి పది కోట్లు అయినా ఈ సినిమా కలెక్ట్ చేస్తుందా? లేదా? అనే సందేహాలు అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు ట్రేడ్ వర్గాల్లో నెలకొన్నాయి.
అనుష్క పాన్ ఇండియా స్టార్. తెలుగుతో పాటు హిందీలోనూ దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి పేరుంది. తమిళంలో సినిమా తీసిన అనుభవం ఉంది. తమిళ్ హీరో విక్రమ్ ప్రభు, తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు, యంగ్ ఆర్టిస్ట్ చైతన్య రావు వంటి భారీ తారాగణం సినిమాలో ఉంది. యువి క్రియేషన్స్ వంటి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉంది. స్టార్ వేల్యూ ఎంత ఉన్నా సరే థియేటర్లలోకి ప్రేక్షకులు రావడానికి కంటెంట్, మౌత్ టాక్, రివ్యూస్, రెస్పాన్స్ కీలకం అవుతుందని 'ఘాటీ'తో మరోసారి ప్రూవ్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ బరిలో డిజాస్టర్ దిశగా ఈ సినిమా పయనిస్తోంది.
Also Read: ఘాటీ vs లిటిల్ హార్ట్స్... బాక్సాఫీస్ కలెక్షన్లలో మౌళి మూవీ ముందు అనుష్క సినిమా గల్లంతు!





















