Shrasti Verma: 'ఢీ' షో To బిగ్ బాస్ హౌస్ - ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
Shrasti Verma Background: ది ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. 'ఢీ' షోతో ఫేమ్ సంపాదించుకున్న ఆమె కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అసలు శ్రష్టి ఎవరో తెలుసా..

Bigg Boss 9 Contestant Sharsti Verma Background: ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈసారి హౌస్‌లో 9 మంది సెలబ్రిటీలతో పాటు ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లో స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ. తన కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తనదైన గ్రేస్, టాలెంట్‌తో హౌస్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
'ఢీ' షో ద్వారా...
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణమైన శ్రష్టి వర్మ దాన్నే కెరీర్‌గా మలుచుకోవాలనున్నారు. ఛాన్సెస్ కోసం చూస్తున్న టైంలో 'ఢీ' షో నుంచి కాల్ రావడంతో అందులో పార్టిసిపేట్ చేశారు. తనదైన డ్యాన్స్, టాలెంట్‌తో పాపులర్ అయ్యారు శ్రష్టి వర్మ. తన టాలెంట్‌తో బిగ్ ఫేమ్ సంపాదించుకోగా ఆ తర్వాత కొన్నాళ్లు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. అలా తన జర్నీని ప్రారంభించిన ఆమె ఎందరో స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు.
శర్వానంద్ 'మనమే' సినిమాకు ఫస్ట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత జైలర్, విక్రాంత్ రానా, గేమ్ ఛేంజర్, రంగస్థలం, పుష్ప 2 చిత్రాలకు పని చేశారు.
View this post on Instagram
ఫస్ట్ మూవీ
ఓవైపు డ్యాన్స్, మూవీస్‌కు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటించారు. ఫస్ట్ మూవీ 'యథా రాజా తథా ప్రజా' మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు శ్రష్టి. అందులో జానీ మాస్టర్ సరసనే హీరోయిన్‌గా చేశారు. ఆయనకు అసిస్టెంట్‌గా చేస్తూనే మూవీలో నటించారు.
కాంట్రవర్శీ... జానీ మాస్టర్‌పై ఆరోపణలు
'ఢీ' షో టైంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో శ్రష్టి వర్మకు పరిచయం ఏర్పడింది. ఆయనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మూవీలో నటించిన ఆమె ఆయనపై లైంగిక ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తనను లైంగికంగా వేధించారని... అవుట్ డోర్ షూటింగ్స్ పేరిట ఇబ్బందులకు గురి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారని చెప్పారు. ఈ అంశం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ హౌస్‌లోకి
ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి శ్రష్టి వర్మపై పడింది. ఫస్ట్ పెర్ఫార్మెన్స్‌తోనే అదరగొట్టిన ఆమె తనకు బిగ్ బాస్ అంటే ప్రాణమని... హౌస్‌లో యాక్ట్ చేయడం వీలు కాదని మనలో రియాలిటీ బయటకు వస్తుందని చెప్పారు. తనదైన ఆటతో బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతానంటూ చెప్పారు. ఓ కొరియోగ్రాఫర్‌గా ఎందరో అభిమానులను సంపాదించుకున్నా శ్రష్టి తన గేమ్‌తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఎలాంటి పోటీ ఇవ్వనుందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















