అన్వేషించండి

Best Horror Movies On OTT: కూతురిని చంపాలనుకునే తల్లి కథ, మాస్క్ వేసుకొని మరీ వెంటాడుతుంది - అసలు ఇలా ఎవరైనా ఉంటారా?

Movie Suggestions: సొంత కూతురిని ఎవరైనా చంపాలనుకుంటారా అనుకునేవారికి ఈ సినిమానే సమాధానం. బ్రతికున్నప్పుడు టార్చర్ చేసి చనిపోయిన తర్వాత కూడా మళ్లీ వచ్చి కూతురికి టార్చర్ చూపించాలనుకునే తల్లి కథే ‘అమ్మ’

Best Horror Movies On OTT: తల్లీకూతుళ్ల అనుబంధంపై ప్రతీ భాషలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అందులో దాదాపు ప్రతీ సినిమాలో కూతురికి ఏదో ఒక కష్టం వస్తే.. తల్లి ప్రపంచాన్ని ఎదిరించి నిలబడుతుంది. కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి ఎంత దూరం అయినా వెళ్తుంది. కానీ ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ‘ఉమ్మ’ (Umma) మూవీ మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో తల్లీ, కూతుళ్ల మధ్య ప్రేమ, అప్యాయత లాంటివి ఏమీ ఉండవు. వాళ్లిద్దరి మధ్య పగ మాత్రమే ఉంటుంది. కూతురి మీద పగతీర్చుకోవడం కోసం చనిపోయిన తల్లి.. ఆత్మగా తిరిగొస్తుంది.

కథ..

‘ఉమ్మ’ సినిమా మొదలవ్వగానే సియోన్ అనే అమ్మాయిని వాళ్ల అమ్మ టార్చర్ చేస్తుంటుంది. తనకు కరెంటు షాక్ పెట్టి మరీ తనను హింసిస్తుంటుంది వాళ్ల అమ్మ. కొన్నేళ్ల తర్వాత అమాండ (సాండ్రా ఓ), క్రిస్ (ఫివెల్ స్టెవార్ట్) అనే తల్లీకూతుళ్లు సిటీకి దూరంగా ఒక ఫార్మ్ హౌజ్‌లో జీవిస్తుంటారు. వీరిద్దరూ తేనె బిజినెస్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అమాండకు ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే అస్సలు ఇష్టముండదు. అందుకే వైర్లతో సహా అన్నింటినీ కలిపి ఇంటి బేస్మెంట్‌లో వేసి తాళం వేస్తుంది. వేరే వాళ్లను సంప్రదించడానికి వారి దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండదు. వారిద్దరూ ఎక్కువగా మనుషులతో కూడా కలవరు. తాము తయారు చేసే తేనెను తీసుకువెళ్లి అమ్మే డ్యానీ (డెర్మోట్ ముల్రోనే) మాత్రమే తరచుగా తమ ఇంటికి వస్తుంటాడు.

ఒకరోజు క్రిస్.. డ్యానీని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక కొరియన్ వ్యక్తి తనను అడ్రస్ అడుగుతాడు. తనకు కొరియా రాదు కాబట్టి మౌనంగా చూస్తుంటుంది క్రిస్. అదే సమయంలో ఆ వ్యక్తి కారులో ఒక బాక్స్‌ను గమనిస్తుంది. తను ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్లిపోతుంది క్రిస్. కానీ ఆ వ్యక్తి వచ్చేది క్రిస్ ఇంటికే. అతడు అమాండ బాబాయ్. తన తల్లి చాలాకాలం క్రితం చనిపోయిందని, కూతురిగా అమ్మ అస్థికలకు అమాండ పూజ చేస్తే తన తల్లి ఆత్మ శాంతిస్తుందని తను తెచ్చిన బాక్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ బాక్స్‌ను తెరిచి చూస్తే అందులో తన తల్లి ఉపయోగించే మాస్క్, దాంతో పాటు కొరియన్ వాళ్లు ధరించే ఒక ట్రెడీషనల్ గౌన్ ఉంటుంది. అప్పటినుండి వాళ్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అమాండకు తన తల్లి ఆత్మ కనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన తల్లి నుండి అమాండ ఎలా విముక్తిని పొందింది అనేది తెరపై చూడాల్సిన కథ.

చాలా మైనస్‌లు..

ఒక అమ్మను విలన్‌గా చూపిస్తూ హారర్ సినిమాను తెరకెక్కించాలనుకున్న దర్శకుడు ఐరీస్ షిమ్ ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యింది. కానీ ఇది హారర్ మూవీ అని ప్రేక్షకులను భయపెట్టే విషయంలో మాత్రం తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. తల్లీకూతుళ్లుగా సాండ్రా ఓ, ఫివెల్ స్టెవార్ట్.. అద్భుతంగా నటించారు. ‘అమ్మ’ మూవీలో వీరి నటన మాత్రమే పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఆత్మగా మారిన తర్వాత కూడా కూతురిని తల్లి టార్చర్ చేస్తుంది అనే హారర్ ఎలిమెంట్‌ను బాగా ప్లాన్ చేసిన దర్శకుడు.. దానిని తెరపై సరిగా చూపించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం కోసం లాజిక్ లేకుండా సినిమాను ముగించాడని అనిపిస్తుంది. ఒక సింపుల్ హారర్ సినిమాను చూడాలనుకునేవారు ‘ఉమ్మ’ను ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్‌కు, నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

Also Read: మౌనంగా ఉంటే రూ.10 కోట్లు - ఏడాది మొత్తం మాట్లాడుకోని భార్యభర్తలు, వాట్ నెక్ట్స్ అనిపించే మూవీ ఇది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP DesamLSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
Oats Omelette Recipe : ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ.. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్
ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ.. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Abhishek Sharma : అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు స్పెషల్ మెసేజ్‌
అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు స్పెషల్ మెసేజ్‌
Embed widget