Trisha: దర్శకుడికి క్లారిటీ ఉంటే చాలు, నేను వాళ్ళ పనిలో జోక్యం చేసుకోను - 'బృంద' సిరీస్ సక్సెస్ ఇంటర్వ్యూలో త్రిష
Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష.. ‘బృంద’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల విడుదలయిన ఈ సిరీస్ పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతుండగా తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది త్రిష.
Trisha About Brinda Web Series: థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందించే విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. సినిమాలలాగానే వెబ్ సిరీస్‌లకు కూడా ఎనలేని పాపులారిటీ లభించింది. అందుకే సీనియర్ నటీనటులు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి వెనకాడడం లేదు. ఇటీవల ఈ లిస్ట్‌లో జాయిన్ అయ్యింది సీనియర్ హీరోయిన్ త్రిష. సోనీ లివ్‌లో విడుదలయిన ‘బృంద’ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లో అడుగుపెట్టింది. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంది. ఓటీటీ అనేది నటీనటులకు మేలు చేస్తుందని వ్యాఖ్యలు చేసింది.
పోలీస్ పాత్ర..
‘బృంద’ లాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ఎందుకు ఎంచుకున్నారు అని అడగగా.. ‘‘సూర్య నాకు స్క్రిప్ట్ పంపారు. అప్పుడు నేను ఫ్లైట్‌లో ఉన్నాను కాబట్టి కొన్ని పేజీలు చదువుదామని అనుకున్నాను. మొదటి చాప్టర్ నుండే నేను కథలో లీనమయిపోయాను. నేను మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించా. అది ఆసక్తికర విషయం. లీడ్ యాక్టర్‌ను ఎలా చూపించాలి? అనేది డైరెక్టర్‌కు 100 శాతం క్లారిటీ ఉంటే అది నటీనటులకు మంచి ఛాలెంజ్ లాంటిదే. బృంద అనే క్యారెక్టర్ ఎలా ఉండాలి? అని మేము అన్నిరకాలుగా డిస్కషన్స్ చేశాం. వాటి వల్ల చాలా మార్పులు జరిగాయి. సెట్‌లో అడుగుపెట్టే ముందే కలిసి కూర్చొని డిస్కషన్స్ చేయడం వల్ల మన వర్క్ సింపుల్ అవుతుంది’’ అని వివరించింది త్రిష.
దర్శకుడు చెప్పినట్టు చేస్తా..
‘బృంద’లో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ‘‘బృంద క్యారెక్టర్‌లోని కొన్ని లక్షణాలు నిజంగా చాలా ప్రశంసించేలా ఉంటాయి. తనకు ఎదురైన కష్టాలను ఆమె ఎదుర్కునే తీరు నాకు చాలా నచ్చింది’’ అని చెప్పుకొచ్చింది త్రిష. దర్శకుడు చెప్పిన కథలో మార్పులు చేస్తారా? అని అడగగా... ‘‘లేదు నేను దర్శకుడు ఏం చెప్తే అది చేసే యాక్టర్‌ను. దర్శకుడి విజన్‌లోనే నా పాత్రలను చూస్తాను’’ అని తెలిపింది త్రిష. ఇప్పటికే ఆవిడ పలు ప్యాన్ ఇండియా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఓటీటీ వరల్డ్‌లో తన డెబ్యూనే ప్యాన్ ఇండియా వైడ్‌గా చాలా భాషల్లో విడుదలయ్యింది. దీనిపై కూడా త్రిష స్పందించింది.
ముగింపు లేదు...
‘‘అన్ని భాషల్లో విడుదల అవుతుంది కాబట్టే నేను ఓటీటీలో డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యాను. ఈ రోజుల్లో సినిమాలు కూడా ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదల అవుతున్నాయి కాబట్టి నటులుగా మేము చాలా భాషల ప్రేక్షకులకు చేరువ కాగలుగుతున్నాం. ఓటీటీ వల్ల యాక్టర్ల జీవితానికి ముగింపు అనేది ఉండదు. ఇంతకు ముందు కూడా ముగింపు ఉందని నేను అనుకోలేదు. కానీ, ఓటీటీలో వస్తున్న కొత్త కంటెంట్ వల్ల, స్క్రిప్ట్స్ వల్ల, పాత్రల వల్ల ప్రపంచం మాదే అన్నట్టుగా అనిపిస్తుంది’’ అని సంతోషం వ్యక్తం చేసింది త్రిష. త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ‘బృంద’.. ఆగస్ట్ 2 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది.
Also Read: నేను సింగిల్ అని చెప్పానా? - పస్ట్‌టైం తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై నోరు విప్పిన కీర్తి సురేష్