అన్వేషించండి

Keerthy Suresh: నేను సింగిల్‌ అని చెప్పానా? - పస్ట్‌టైం తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై నోరు విప్పిన కీర్తి సురేష్‌

Keerthy Suresh: హీరోయిన్‌ కీర్తి సురేష్‌ మొదటి సారి తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌పై పెదవి విప్పింది. తాజా ఓ ఇంటర్య్వూలో తాను సింగిల్‌ కాదంటూ పరోక్షంగా రిలేషన్‌లో ఉన్నట్టు హింట్‌ ఇచ్చింది. 

Keerthy Suresh Said She is not Single: మహానటి కీర్తి సురేష్‌ ట్రోల్స్‌పై స్పందించింది. కెరీర్‌ ప్రారంభంలో తన సినిమాలన్ని డిజాస్టర్ అయ్యాయని, దాంతో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పింది. బహుశా దక్షిణాది హీరోయిన్లలో ఎక్కువగా ట్రోల్స్‌ ఎదుర్కొంది తానేనేమో అంటూ చమత్కరించింది. ఆమె నటించిన లేటెస్ట్‌ తమిళ చిత్రం 'రఘుతాత'. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్‌ ఓ పాడ్‌కాస్ట్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తొలిసారి తన రిలేషన్‌ స్టేటస్‌పై నోరు విప్పింద తాను సింగిల్‌ కాదంటూ ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చి కుర్రకారు గుండెల్లో బాంబు పేల్చింది.

ఈ మేరకు కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా వృత్తిపరమైన జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నా. వర్క్‌ లైఫ్‌ సంతృప్తిగా ఉంది. కానీ, కెరీర్‌ ప్రారంభంలో నేను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పొందాయి. దాంతో నాకు సినిమాలు ఎంచుకోవడం రాదని, టేస్ట్‌ లేదంటూ విమర్శించారు. ఇక నా కెరీర్‌ అంతే అంటూ ట్రోల్‌ చేశారు. బహుశా సౌత్‌ ఇండస్ట్రీలో అత్యధిక ట్రోల్స్‌ ఎదుర్కొన్న నటిని నేనే అనుకుంటా. అయితే మహానటి తర్వాత నాపై ట్రల్స్‌ తగ్గాయి. అయితే విమర్శలను నేను స్వాగతిస్తాను. అందులో వివరణాత్మక విమర్శలను నుంచి కొత్త విషయాలను నేర్చుకున్నాను. అయితే ప్రతిదానికి నేను సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది కావాలనే నాపై నెగిటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు. అవి నేను పెద్దగా పట్టించుకోను. అలాంటి వాటికి కాలమే సమాధానమే చెబుతుందని నా నమ్ముతాను" అంటూ చెప్పుకొచ్చింది. 

అనంతరం పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. "ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి" అని పేర్కొంది. అనంతరం హోస్ట్‌ సింగిల్‌గా ఉంటున్నారు.. లైఫ్‌ బోర్‌గా అనిపించడం లేదా? అని ప్రశ్నించగా.. దానికి కీర్తి నవ్వుతూ.. "నేను సింగిల్‌ అని చెప్పలేదుగా" అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అంటే కీర్తి ప్రస్తుతం రిలేషన్ ఉందని అంతా ఫిక్స్‌ అయిపోతున్నారు. 

కాగా గతంలో కీర్తి సురేష్‌ పెళ్లంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర అనిరుధ రవిచందర్‌తో రిలేషన్‌ ఉందని, అతడినే పెళ్లి చేసుకోబోతుంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే అందులో నిజం కీర్తి తండ్రి తేల్చేశారు. ఇటీవల కీర్తి ఓ వ్యక్తితో చాలా క్లోజ్‌గా దిగిన ఫోటో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇద్దరు ఎల్లో కలర్‌ డ్రెస్‌లు వేసుకుని కనిపించారు. ఈ ఫోటో షేర్‌ చేస్తూ కీర్తి అతడికి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. దాంతో అతడు ఆమె ప్రియుడు అనుకున్నారు. అతడు తన చిన్ననాటి స్నేహితుడని, అతడినే పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలపై కీర్తి స్పందించకపోవడం గమనార్హం. ‌

Also Read: మాథియాస్‌తో ఫస్ట్‌డేట్‌ - దుబాయ్‌లో అమ్మేస్తాడేమో అని భయపెట్టారు, తాప్సీ కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Embed widget