Pawan Kalyan OG: పవన్ 'ఓజీ'లో జానపద గాయనికి ఛాన్స్ - తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై తమన్ ప్రకటన
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజి మీద సంగీత దర్శకుడు తమన్ 'ఓజీ' గురించి అప్డేట్ ఇచ్చారు. ఆ సినిమాలో జానపద గాయనికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆవిడ ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. ఆ బాధ్యత ఆయన స్వీకరించడానికి ముందు, ఇప్పుడు కూడా జనసేన పార్టీకి అధినేత. మరి, పవన్ రాజకీయాల్లోకి రావడానికి ముందు? పవర్ స్టార్! తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో 'ఓజీ' (OG Movie) ఒకటి. ఆ సినిమాలో ఓ సాంగ్ పాడే అవకాశాన్ని ఏపీకి చెందిన జానపద గాయని లక్ష్మికి సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) అవకాశం ఇచ్చారు. ఆవిడ ఎవరు? ఈ అవకాశం ఎక్కడ ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళితే...
తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజి మీద!
Telugu Indian Idol 3: గాయనీ గాయకుల్లో ప్రతిభావంతులు, యంగ్ టాలెంట్ వెలికి తీయడం కోసం ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా చేపట్టిన ప్రోగ్రాం 'తెలుగు ఇండియన్ ఐడల్'. ఇప్పుడు మూడో సీజన్ రన్ అవుతోంది. సింగింగ్ రియాలిటీ షోకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' లేటెస్ట్ ఎపిసోడ్ (Telugu Indian Idol 3 Latest Episode)లో ఏపీ రాష్ట్రానికి చెందిన జానపద గాయని లక్ష్మి (AP Folk Singer Lakshmi) గెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన తమన్... ఓజీలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
లక్ష్మికి టోకెన్ అమౌంట్ ఇచ్చిన తమన్!
'ఓజీ' (They Call Him OG)లో ఒక పాట పాడే అవకాశానికి గాను లక్ష్మికి 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 స్టేజి మీద టోకెన్ అమౌంట్ ఇచ్చారు తమన్. తన సినిమాల్లో జానపద గాయకులకు ముందు నుంచి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. జానపద గీతాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
Also Read: బన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?
ఆయ్! ఈ వీకెండ్ అదిరిపోద్దండి!!🥳
— ahavideoin (@ahavideoIN) July 16, 2024
Route maarindhi- Beat maarindhi..😍#TeluguIndianIdolS3 Episode 11&12 on July 19th and 20th at 7pm 🎙️🔥
@geethasinger @MusicThaman @Sreeram_singer @iamvijayyesudas @ram_miriyala @NarneNithiin pic.twitter.com/h7sSnwNkaf
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన 'భీమ్లా నాయక్' సినిమాకు తమన్ సంగీతం అందించారు. అందులో పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య చేత ఒక పాట పాడించారు. ఇప్పుడు పవన్ సినిమా కోసం మరొక జానపద గాయని చేత ఇంకో పాట పాడిస్తున్నారు. లక్ష్మి పెర్ఫార్మన్స్ చూసి మరొక న్యాయనిర్ణేత గీతా మాధురి, గెస్ట్ జడ్జ్ విజయ్ ఏసుదాస్ కూడా అప్రిషియేట్ చేశారు.
Also Read: శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!
జానపద గాయని లక్ష్మి పెర్ఫార్మన్స్ వ్యూయర్స్ చూడాలంటే... శుక్ర, ఆది వారాల్లో ఆహా ఓటీటీ ఓపెన్ చేయాలి. కొత్త ఎపిసోడ్స్ ఆ రెండు రోజుల్లో స్ట్రీమింగ్ అవుతాయి.





















