Tamannaah New Song: తమన్నా 'గఫూర్' సాంగ్... షారుఖ్ ఖాన్ కొడుకు సిరీస్‌లో మిల్కీ బ్యూటీ సంచలనం... వైరల్ వీడియో ఇదే
The Ba***ds of Bollywood: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ప్రజెంట్ అది వైరల్ అవుతోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ చేస్తే అటు యూట్యూబ్ ఇటు సోషల్ మీడియా షేక్ అవ్వాలంతే! అందులో మరో తావు లేదు అన్నట్టుంది పరిస్థితి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డైరెక్ట్ చేసిన 'ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్'లో ఆవిడ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అయింది.
గఫూర్... షేక్ ఆడిస్తోంది!
ఆర్యన్ ఖాన్ కథ రాయడంతో పాటు దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్'. ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేశారు.
Also Read: చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్నారా? 'భోళా శంకర్' డిజాస్టర్, ప్రచారంపై అనిల్ సుంకర రియాక్షన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ మీద సెటైరికల్ టేక్ ఈ గఫూర్ సాంగ్ అని చెప్పాలి. ఇంతకు ముందు హిందీలో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసినప్పుడు గ్లామర్ షో ఫుల్లుగా చేశారు. అందుకు ఏమాత్రం తగ్గదన్నట్టు గఫూర్ సాంగ్ ఉంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ గురించి తమన్నా గ్లామర్ షో గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.
View this post on Instagram
'ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్ విషయానికి వస్తే విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ హిందీ సినిమా ఇండస్ట్రీలో జరిగే అంశాలను తీసుకుని ఈ వెబ్ సిరీస్ చేసినట్లు అర్థం అవుతుంది. ఇందులో లక్ష్ లల్వాని, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.





















