Jai Bhim: ‘జై భీమ్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రెండు విభాగాల్లో పురస్కారాలు
సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమాకు రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ సహాయ నటుడు అవార్డులను ఈ చిత్రం కైవశం చేసుకుంది.
నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
సూర్య తన సంస్థ అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ గుడ్ న్యూస్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ‘‘దాదా సాహేబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘జై భీమ్’ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్న మణికందన్‌కు అభినందనలు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పోలీసు క్రూరత్వానికి గురైన బాధితుడి పాత్రలో మణికందన్ జీవించిన సంగతి తెలిసిందే. అలాగే అతడి భార్య పాత్రలో లిజోమోల్ జోస్ మంచి అభినయాన్ని ప్రదర్శించి ‘జై భీమ్’కు సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఇందులో సూర్య అడ్వకేట్ చందు పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు.
Also Read: హైదరాబాద్‌లో షూటింగ్స్ వద్దు, హీరో అజీత్‌పై రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు
రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి కె చంద్రు నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం స్థానికంగా వివాదానికి గురైంది. దోపిడీ చేశాడనే తప్పుడు ఆరోపణలతో ఒక పేద గిరిజనుడిని పోలీసులు ఏ విధంగా కేసులో ఇరికించారు. ఆ తర్వాత అతడిని ఏం చేశారనే కథాశంతో ఈ చిత్రనడుస్తుంది. ముఖ్యంగా కోర్టులోని సన్నివేశాలు రక్తికట్టిస్తాయి.
#JaiBhim wins the Best Film & Best Supporting Actor awards at the #DadaSahebPhalkeFilmFestival
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 3, 2022
Thank you @dadasahebfest for the honour!
Congratulations #Manikandan on winning the Best Supporting actor
➡️https://t.co/8pwZaoeO17@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian
2021లో ఉత్తమ భారతీయ చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. 94వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్‌కు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఈ తమిళ చిత్రం కూడా షార్ట్‌లిస్ట్ చేయబడింది. కానీ నామినేషన్ల తుది జాబితాలో చేరలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'జై భీమ్' స్ర్ట్రీమింగ్ అవుతోంది. జై బీమ్ చిత్రం IMDb వెబ్‌సైట్‌లో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ‘జై బీమ్’ చిత్రం 53 వేల ఓట్లను పొంది 9.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Also Read: తమిళ హీరో ధనుష్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్, మళ్లీ మొదటికొచ్చిన పాత కేసు
View this post on Instagram