Sundarakanda OTT: సుందరకాండ ఓటీటీ డీల్ క్లోజ్... నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా?
Sundarakanda movie 2025 OTT: వినాయక చవితి సందర్భంగా నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' థియేటర్లలో విడుదలైంది. అంతకు ముందు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Nara Rohith's Sundarakanda Movie OTT Update: ఆడియన్స్‌కు డిఫరెంట్ ఫిలిమ్స్ అందించాలని ట్రై చేసే యంగ్ హీరో నారా రోహిత్. 'సుందరకాండ'తో వినాయక చవితి పండక్కి థియేటర్లలోకి వచ్చాడు. ప్రీమియర్స్ నుంచి సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూ ('సుందరకాండ'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? డిటెయిల్డ్ అనాలసిస్) చదివి తెలుసుకోండి. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా?
జియో హాట్‌స్టార్ ఓటీటీలో 'సుందరకాండ'
Sundarakanda 2025 Movie Streaming Rights Acquired By JioHotstar OTT: నారా రోహిత్ 'సుందరకాండ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. శాటిలైట్ (టీవీ టెలికాస్ట్) రైట్స్ స్టార్ మా తీసుకుంది.
గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఆగస్టు 27న 'సుందరకాండ' సినిమా వచ్చింది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్లు వస్తే లేటుగా ఓటీటీకి రావొచ్చు.
నారా రోహిత్ కమ్ బ్యాక్... శ్రీదేవి రీ ఎంట్రీ!
'సుందరకాండ'తో నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇచ్చారని ప్రీమియర్ షోస్ రిపోర్ట్ బట్టి అర్థం అవుతోంది. 'ప్రతినిధి 2'తో ఐదేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఆశించిన విజయం అందుకోలేదు. మల్టీస్టారర్ మూవీ 'భైరవం'తో ఈ ఏడాది మళ్ళీ థియేటర్లలోకి వచ్చారు. మోస్తరు విజయం సాధించారు. సోలో హీరోగా 'సుందరకాండ'తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు.
Also Read: ఓటీటీలో 'కింగ్‌డమ్' స్ట్రీమింగ్ షురూ... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ విజయ్ దేవరకొండ సినిమా
'సుందరకాండ'తో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ 'వీర' (2011) తర్వాత ఆవిడ నటించిన తెలుగు సినిమా ఇది. పుష్కర కాలం కంటే ఎక్కువ... 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ తెలుగు వెండితెరపై కనిపించారు. స్కూల్‌లో నారా రోహిత్ సీనియర్ రోల్ చేశారు.
'సుందరకాండ' కథ విషయానికి వస్తే... స్కూల్‌లో తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్)ను సిద్ధార్థ్ (నారా రోహిత్) ఇష్టపడతాడు. తానెవరో రివీల్ చేయకుండా గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఆ విషయం వైష్ణవి ఇంట్లో తెలిసి ఆమె తండ్రి స్కూల్‌కు వచ్చి కొడతాడు. అమ్మాయిని స్కూల్ మాన్పించేస్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. పెద్దయిన తర్వాత పెళ్ళి సంబంధాల కోసం వెళ్ళిన ప్రతిసారీ అమ్మాయిలో ఐదు లక్షణాలు ఉన్నాయా? లేదా? అని సిద్ధార్థ్ వెతకడం మొదలు పెడతాడు. వైష్ణవిలో తాను గమనించిన ఐదు లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు. ఆ ఐదు లక్షణాలు ఏమిటి? అటువంటి అమ్మాయి ఐరా (వృతి వాఘాని) దొరికి ప్రేమలో పడేసిన తర్వాత పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు వచ్చాయి? అనేది సినిమా. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్ చేయకుండా చెప్పేశారా?





















