Sita Ramam OTT Release : థియేటర్లలో 'సీతా రామం' మిస్ అయినవాళ్లకు గుడ్ న్యూస్, మళ్ళీ మళ్ళీ చూడలనుకునే వాళ్ళకూ...
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా... రష్మిక కీలక పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన అందమైన దృశ్యకావ్యం 'సీతా రామం' ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యింది.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన సినిమా 'సీతా రామం' (Sita Ramam Movie). ఇందులో రష్మిక మందన్న (Rashmika Mandanna), యువ దర్శకుడు & నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వారమే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
'సీతా రామం' Sita Ramam OTT Release Date : 'సీతా రామం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నెల 9న నుంచి సినిమాను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రైమ్ సబ్‌స్కైబర్స్ సినిమాను చూడొచ్చు.
థియేటర్లలో సినిమా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో సినిమా చూడొచ్చు. థియేటర్లలో చూసిన వాళ్ళు కూడా ఓటీటీలో మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఇటువంటి ప్రేమకథలకు ఓటీటీలో వీక్షకాదరణ బావుంటుంది. అందువల్ల, ఈ వీకెండ్ ఓటీటీ వీక్షకులకు ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచు.
దుల్కర్, మృణాల్ నటనకు ప్రేక్షకులు ఫిదా
'సీతా రామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అంది. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా హృద్యంగా ప్రేమకథను తెరకెక్కించారని పలువురు ప్రశంసించారు. విశాల్ చంద్రశేఖర్ బాణీలు, నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఖర్చుకు రాజీ పడకుండా వైజయంతి మూవీస్ సంస్థ సినిమాను నిర్మించింది.
Also Read : 'కెప్టెన్' టు 'బ్రహ్మాస్త్ర' - థియేటర్లలో విడుదలయ్యే ఎనిమిది సినిమాల్లో మీ ఓటు దేనికి?
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రమిది. ఈ సినిమాతో ఆయన మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. బాక్సాఫీస్ బరిలో సినిమా భారీ విజయం సాధించింది. అంత కంటే... ఎక్కువ ప్రసంశలు వచ్చాయి. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించారు. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.
'సీతా రామం' చిత్రానికి చిరంజీవి ప్రశంసలు
''సీతారామం చూశాను. చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లేతో కథని ఆవిష్కరించిన విధానం నాకు ఎంత గానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్ , ప్రియాంకా దత్ , దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కు, సీతా - రామ్ లుగా ఆ ప్రేమకథకు ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు'' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం