Single OTT Platform: ఆ ఓటీటీలోకి శ్రీ విష్ణు 'సింగిల్' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Single OTT: శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ '#సింగిల్' శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Sree Vishnu's '#Single' OTT Platform Locked: యంగ్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ '#సింగిల్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించగా.. కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) హీరోయిన్స్‌గా నటించారు. వెన్నెల కిశోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఆ ఓటీటీలోకి..
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్‌లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హిట్ టాక్ సొంతం చేసుకుంటే ఓటీటీలోకి రావడం కాస్త ఆలస్యం కావొచ్చు. ఈ క్రమంలో 'సింగిల్' కూడా 4 వారాల తర్వాత అంటే జూన్ రెండో వారంలో కానీ ఆ తర్వాత కానీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.
మూవీపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తనదైన స్టైల్, కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నారు శ్రీ విష్ణు. '#సింగిల్' మూవీ కూడా ఫుల్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ రోల్ అదిరిపోయిందని.. ఇద్దరి కామెడీ టైమింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఫస్ట్ హాఫ్ కామెడీ అదిరిపోయిందని.. సెకండాఫ్ కూడా అదే రేంజ్‌లో ఉందని అంటున్నారు.
కొందరు మాత్రం స్టోరీలో కొత్త దనం లేదని.. ఎప్పటిలానే నార్మల్ కామెడీ పంచులు వేశారంటూ కామెంట్ చేస్తున్నారు. మెజార్టీ నెటిజన్లు శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, వెన్నెల కిశోర్‌తో కలిసి కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. 'చాలా రోజుల తర్వాత థియేటర్లలో నవ్వులు చాలా ఆర్గానిక్‌గా వినిపిస్తున్నాయి.' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#Single ENTERTAINER!!
— SpreadFLIX (@spreadflix) May 9, 2025
Ideal summer flick with tons of laughs and a decent story. Solid first half matched by an equally strong second half.#SreeVishnu has a winner in hand! 🔥 pic.twitter.com/HXWoeVr9Yz
#Single is a laugh-packed rampage that never dips in both the halves. #SreeVishnu leads with flawless comic timing, supported by #VennelaKishore. They are sensational in this solid entertainer 🔥
— Filmy Bowl (@FilmyBowl) May 9, 2025
The story is refreshing but the crazy dialogues and Vishnu's delivery makes the…
Wow congratulations @sreevishnuoffl anna.....
— Mahesh (@starmahesh10) May 9, 2025
E roju evening #Single ki settu https://t.co/GHRTQXjwgk





















