HIT 3: 'హిట్ 3'తో నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ హిట్ - వరుసగా నాలుగో హిట్ నాని సొంతం.. ఇదే జోష్‌తో..
Nani: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'హిట్ 3'. రూ.48.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. కేవలం 6 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది.

Nani's HIT 3 Complete Break Even In 6 Days: 'హిట్ 3'.. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్ అయిన 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది.
'హిట్ 3'తో క్లీన్ హిట్
ఈ మూవీకి రూ.48.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. కేవలం 6 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. 'హిట్ 3'తో (HIT 3) వరుసగా నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'దసరా' మూవీతో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాని.. 'హిట్ 3'తో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 4 రోజుల్లోనే రూ.101 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించారు. రూ.75 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా నిలిచారు.
తొలి రోజు రూ.43 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డులకెక్కింది. ఇక రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మూడో రోజు అదే జోష్ కొనసాగిస్తూ రూ.82 కోట్లకు రీచ్ అయ్యింది. ఆ తర్వాత రూ.101 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది.
మహేష్ బాబు తర్వాత..
అటు, యూఎస్ మార్కెట్‌లోనూ నాని మరో సక్సెస్ అందుకున్నారు. 5 రోజుల్లోనే ఓవర్సీస్‌లో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది. మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత యూఎస్‌లో అత్యధికంగా 1 మిలియన్ డాలర్లు సాధించిన తెలుగు హీరోగా నాని రికార్డును స్థిరంగా ఉంచుకున్నారు. మొదటి వారంలోనే విడుదలైన అన్నీ ప్రాంతాల్లోనూ మంచి వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
'హిట్ 3' మూవీకి నైజాం ఏరియాలో రూ.11 కోట్ల బిజినెస్ జరగ్గా.. 5 రోజుల్లోనే రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అటు, ఉత్తరాంధ్ర, వెస్ట్, ఈస్ట్ గోదావరి ఏరియాల్లోనూ మంచి ప్రాఫిట్స్ రాబోతున్నాయి.
'A' రేటెడ్ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్
ఈ సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉందని.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు దూరంగా ఉండాలని రిలీజ్‌కు ముందే మూవీ టీం ప్రకటించింది. అయితే, ఫస్ట్ 3 రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్లకు క్యూ కట్టారు. రూథ్‌లెస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌ను చూసేందుకు మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం తరలివచ్చారు. దీంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. 'A' రేటెడ్ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ తరలిరావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేం 'శ్రీనిధి శెట్టి' (Srinidhi Shetty) నటించగా.. రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. 'హిట్ 3' జోష్‌తో నాని తన తర్వాత మూవీ 'ప్యారడైజ్'కు రెడీ అవుతున్నారు. డిఫరెంట్ రోల్‌లో నేచురల్ స్టార్ నటిస్తుండడంతో మూవీపై భారీ హైప్ నెలకొంది.





















