సింగ్ గీతం సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
Sing Geetham OTT : సింగీతం గారి సింగ్ గీతం ఓటీటీ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Sing Geetham OTT Platform : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సింగ్ గీతం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

- సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' చిత్రం థియేటర్లలో విడుదలైంది.
- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు పొందింది; జులైలో స్ట్రీమింగ్ అవుతుంది.
- కుబేరపురంలో తండ్రి సంపద కోసం ప్రతాప్ మన్నె అన్వేషణ.
- గ్రామస్థులతో కలిసి బ్రహ్మయ్య పన్నాగం, గౌరి తెచ్చిన మార్పు.
Sing Geetham's Sing Geetham OTT Release Platform Locked : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డ్రీమ్ ప్రాజెక్ట్ సింగ్ గీతం శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన డైరెక్టర్... మ్యూజికల్ ఫాంటసీ డ్రామాతో మ్యాజిక్ చేశారు. ఈ క్రమంలో మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జులై సెకండ్ వీక్ లేదా లాస్ట్ వీక్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా... అయాన్, అహల్య బుమ్రా, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.
వీరితో పాటే రేవతి, అమృతం ఫేం నారిపెద్ది శివన్నారాయణ, బెనర్జీ, అగు స్టాన్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
ఇండియన్ సినిమాలో ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అప్పటి పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన కామరాజు వంటి మూవీస్‌తో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సింగ్ గీతం స్టోరీ విషయానికొస్తే... బీహార్ జైలు నుంచి తన సొంతూరు కుబేరపురం అనే కుగ్రామానికి తిరిగివస్తాడు ప్రతాప్ మన్నె (అయాన్). తన తండ్రి ఉదయ్ మన్నెం (రాహుల్ రవీంద్రన్)కు ఆ ఊరిలో విలువైన సంపద ఉందని దాన్ని సొంతం చేసుకోవాలని వస్తాడు.
అయితే, అప్పటికే ఆ సంపద అంతా తనకే దక్కాలని తన కూతురు రేణు (షాలిని కొండెపూడి)తో కలిసి ప్లాన్ చేస్తాడు బ్రహ్మయ్య (బెనర్జీ). అలా ఊరి జనం నుంచి భూములు తీసుకుని వారితోనే అక్కడ పనులు చేయిస్తారు. మరోవైపు, ఊరు మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టులో తన అమ్మను చూసుకునే గౌరి (అహల్య బుమ్రా) వల్ల ఆ ఊరిలో ఓ గొప్ప మార్పు జరుగుతుంది? అసలు ప్రతాప్ అనుకున్నది సాధించాడా? ఊరిలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి? గ్రామస్థలు మాటలు ఎందుకు పాటలుగా మారిపోయాయి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : Friday OTT Releases : వీరభద్రుడు To బోల్డ్ సిరీస్ ష్ - ఓటీటీల్లో శుక్రవారం ఒక్క రోజే 21 సినిమాలు
Frequently Asked Questions
సింగ్ గీతం సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?
సింగ్ గీతం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది?
సింగ్ గీతం 4 నుండి 6 వారాల తర్వాత ఓటీటీలోకి రావొచ్చు. జులై రెండో లేదా చివరి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
సింగ్ గీతం సినిమా దర్శకుడు ఎవరు, ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?
సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయాన్, అహల్య బుమ్రా, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.
సింగ్ గీతం సినిమాను ఎవరు నిర్మించారు మరియు సంగీతం ఎవరు అందించారు?
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















