Shanmukh Jaswanth: ఈటీవీ విన్ కోసం షణ్ముఖ్ 'లీలా వినోదం' - గంజాయి కేసులో దొరికిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్
ETV Win App Latest Series: ఈటీవీ విన్ యాప్ తెలుగు వీక్షకులకు క్వాలిటీ అండ్ హెల్దీ కామెడీ సిరీస్‌లు అందిస్తోంది. షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్‌లో చేసిన సిరీస్ ఫస్ట్ లుక్ ఫ్రెండ్షిప్ డేకి విడుదల చేశారు.
![Shanmukh Jaswanth: ఈటీవీ విన్ కోసం షణ్ముఖ్ 'లీలా వినోదం' - గంజాయి కేసులో దొరికిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ Shanmukh Jaswanth new web series for ETV Win Leela Vinodam First Look Streaming Date Cast Crew Details Shanmukh Jaswanth: ఈటీవీ విన్ కోసం షణ్ముఖ్ 'లీలా వినోదం' - గంజాయి కేసులో దొరికిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/2bd506d4c7ebcc5f3c92684dae700f6d1722761593104313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shanmukh Jaswanth New Web Series: షణ్ముఖ్ జస్వంత్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ ట్రెండ్ స్టార్ట్ అయిన తొలినాళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సాఫ్ట్‌వేర్ డేవ్ లవ్ పర్', 'సూర్య' వంటి వెబ్ సిరీస్‌లు చేశాడు. ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ (ETV Win App Latest Web Series) కోసం ఓ సిరీస్ చేశాడు. దాని పేరు 'లీలా వినోదం'
ఫ్రెండ్షిప్ డేకి 'లీలా వినోదం' సిరీస్ ఫస్ట్ లుక్!
Leela Vinodam Web Series First Look: షణ్ముఖ్ జస్వంత్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'లీలా వినోదం'. ఈటీవీ విన్ యాప్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది! స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో షణ్ముఖ్, అతని స్నేహితులుగా నటిస్తున్న మరో ముగ్గురు ఉన్నారు.
అక్టోబర్ 3వ తేదీ నుంచి ETV Winలో స్ట్రీమింగ్!
Leela Vinodam Web Series Streaming Date: యూనిక్ స్టొరీ లైన్, తెలుగు ప్రజలు మెచ్చే వినోదం, మనసులను హత్తుకునే భావోద్వేగాల సమ్మేళనంగా 'లీలా వినోదం' సిరీస్ రూపొందిస్తున్నారని తెలిసింది. ఫ్రెండ్షిప్ డేకి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
షణ్ముఖ్ జస్వంత్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అయితే... ఓసారి ర్యాష్ డ్రైవింగ్, మరోసారి గంజాయి వంటి కేసుల్లో అతని పేరు వినిపించింది. గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతను చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ప్రచార కార్యక్రమాల్లో ఆ కేసు మీద సెటైర్లు సైతం వేసినట్టు ఉన్నారు. ఇది హిట్ అయితే ఆ కేసుల గురించి జనాలు మర్చిపోయే అవకాశం ఉంది.
Also Read: కేరళ వయనాడ్ బాధితుల సహాయార్థం బన్నీ భారీ విరాళం - టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టారే ఫస్ట్
Mundhuga andhariki #HappyFriendShipDay ❤️
— ETV Win (@etvwin) August 4, 2024
Asalu sangathi entante, Mee gang tho meeru chesina anni d̶h̶o̶o̶l̶a̶ p̶a̶n̶u̶l̶a̶n̶u̶, gnapakalanu gurthuchesthu, Unlimited Vinodam panchadaniki ma gang vachesthunaru 🥳
Inthaki title cheppaledhu kadha...#LeelaVinodam 😍
An @etvwin… pic.twitter.com/r4FHDYm91S
ETV Win Original Web Series Leela Vinodam Cast And Crew: షణ్ముఖ్ జస్వంత్ సరసన మలయాళీ భామ అనఘా అజిత్ కథానాయికగా నటించగా... ఆమని, ఆర్జే శరణ్, శివ తుమ్మల, మదన్ ఇతర ప్రధాన తారాగణం.
పవన్ సుంకర దర్శకత్వంలో శ్రీ అక్కియన్ ఆర్ట్స్ పతాకంపై శ్రీధర్ మారిసా 'లీలా వినోదం' సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి భరత్ నరేన్ షో రన్నర్. ఇంకా ప్రొడక్షన్ డిజైన్: మిధునాస్ కల్చర్, కూర్పు: నరేష్ అడుప, సంగీతం: కృష్ణ చేతన్, ఛాయాగ్రహణం: అనూష్ కుమార్, కాస్ట్యూమ్ డిజైన్: ప్రియాంక సూరంపూడి, పాటలు: సురేష్ బనిశెట్టి.
Also Read: దేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)