Allu Arjun - Wayanad Landslide: వయనాడ్ బాధితుల సహాయార్థం బన్నీ భారీ విరాళం - టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టారే ఫస్ట్
Kerala Wayanad Landslide News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ విలయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
వయనాడ్ విపత్తు కేరళ ప్రజలు ఊహించనిది. కొండ చరియలు విరిగిపడి అంతటి విధ్వంసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ ఘటన తన మనసును ఎంతో కలచి వేసిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.
పాతిక లక్షలు విరాళంగా ఇస్తున్న అల్లు అర్జున్
Allu Arjun donates 25 lakhs rupees for Wayanad landslide victims: కేరళలోని వయనాడ్ విపత్తు గురించి అల్లు అర్జున్ ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఈ విపత్తు గురించి స్పందించిన తొలి టాలీవుడ్ బన్నీయే కావడం విశేషం.
''ఇటీవల వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు పడిన ఘటన నన్ను ఎంత గానో బాధించింది. కేరళ ప్రజలు ఎప్పుడూ నా మీద అభిమానం చూపించారు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చారు. నా వంతు బాధ్యతగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పాతిక లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. కేరళ ప్రజలు సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Also Read: రాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!
I am deeply saddened by the recent landslide in Wayanad. Kerala has always given me so much love, and I want to do my bit by donating ₹25 lakh to the Kerala CM Relief Fund to support the rehabilitation work. Praying for your safety and strength . @CMOKerala
— Allu Arjun (@alluarjun) August 4, 2024
అల్లు అర్జున్ తెలుగు వాడు అయినప్పటికీ... మలయాళీలు తమ సొంత హీరోల కంటే ఎక్కువ ఆదరించారు. కేరళలో అక్కడి స్టార్ హీరోలతో పాటు సమానమైన థియేట్రికల్ మార్కెట్ బన్నీ సొంతం. 'పుష్ప' కంటే ముందు నుంచి ఆయనకు అక్కడ మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు భారీ ఎత్తున విడుదల అయ్యేవి.
Also Read: దేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్
అల్లు అర్జున్ కంటే ముందు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి కేరళలోని వయనాడ్ విపత్తు మీద స్పందించిన సెలబ్రిటీలు ఇద్దరు ఉన్నారు. కన్నడిగ అయినప్పటికీ... తెలుగు సినిమాలతో పాన్ ఇండియన్ క్వీన్ అనిపించుకున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పది లక్షల రూపాయలను బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఆమె కంటే ముందు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రూ. 5 లక్షల విరాళంగా ఇచ్చారు. చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ వంటి తమిళ హీరోలు సైతం తమ వంతు విరాళాలు ఇచ్చారు.