అన్వేషించండి

The Raja Saab: రాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!

Thaman On Raja Saab Songs: డార్లింగ్ ఫ్యాన్స్, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాలిడ్, క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మ్యూజిక్ గురించి ఆయన ఓ విషయం చెప్పారు. అది ఏమిటంటే?

Prabhas and director Maruthi's The Raja Saab Music Update: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. 'సలార్', 'కల్కి 2898 ఏడీ' విజయాలు వాళ్ళను సంతోష పెట్టాయి. వసూళ్లకు తోడు 'ది రాజా సాబ్' సినిమా వీడియో గ్లింప్స్ సైతం అందర్నీ ఆకట్టుకుంది. లేటెస్టుగా ప్రభాస్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాంచి అప్డేట్ ఇచ్చారు. 

డార్లింగ్ ఫ్యాన్స్... మాస్ ఫీస్ట్ లోడింగ్!
'ది రాజా సాబ్' సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అది ఒక్కటే కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సహా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు పలు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

'గేమ్ ఛేంజర్' నుంచి ఓ సాంగ్ వచ్చింది. మరో సాంగ్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మరి, 'ది రాజా సాబ్' సంగతి ఏంటి? ఈ ప్రశ్నకు తమన్ లేటెస్టుగా సోషల్ మీడియాలో సమాధానం ఇచ్చారు. జనవరిలో 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Also Readపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు

రెబల్ స్టార్... తమన్... లేటెస్ట్ ఫోటో చూశారా?
''ఇట్స్ డార్లింగ్ టైమ్ విత్ ప్రభాస్'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తమన్ ఓ ఫోటో షేర్ చేశారు. అందులో ప్రభాస్ స్టైలిష్ గా ఉన్నారు. మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ హైప్ పెంచేశారు. జనవరి త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు మారుతిని ట్యాగ్ చేశారు. అదీ సంగతి!

Also Readదేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్


ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'ది రాజా సాబ్' రాక!
The Raja Saab Release Date: 'ది రాజా సాబ్' ఫస్ట్ సాంగ్ జనవరిలో విడుదల చేయాలని అనుకోవడానికి కారణం... సినిమా విడుదల తేదీ! వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. విడుదలకు ఇంకా టైమ్ ఉండటంతో జనవరిలో తొలి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
The Raja Saab: రాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'ది రాజా సాబ్' విడుదల కానుంది. రొమాంటిక్ హారర్ కామెడీగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్లు. ఆల్రెడీ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో మిగతా షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget