Second Case Of Seetharam OTT : ప్రశాంతమైన ఊరిలో వరుస మర్డర్స్ - సైకో మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్
Second Case Of Seetharam OTT Platform : మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

Vijay Raghavendra's Second Case Of Seetharam OTT Streaming : హారర్, థ్రిల్లర్, క్రైమ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ సైకో కిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చి స్టోరీస్ మరో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తాజాగా రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రీసెంట్ కన్నడ బ్లాక్ బస్టర్ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కన్నడతో పాటు తమిళంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.
సీతారాం బెనోయ్ కేస్ నెం.18 మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీకి దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. విజయ రాఘవేంద్ర, గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్‌పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ నిర్మించారు.
View this post on Instagram
Also Read : పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోతుందా? - ఫెయిల్యూర్ To సక్సెస్... టాప్ ఇన్‌స్పైర్డ్ మూవీస్
స్టోరీ ఏంటంటే?
ఫస్ట్ పార్ట్‌లో కేసులను సాల్వ్ చేసిన సీతారాం (విజయ్ రాఘవేంద్ర) అదే ఊరిలో పోలీస్ ఆఫీసర్‌గా కంటిన్యూ అవుతాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలో మళ్లీ గ్రామంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టి అతి దారుణంగా చంపేస్తుంటారు. వరుస మర్డర్స్ కేసును సీతారాం ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.
అయితే, ఓ చిన్న క్లూ కూడా దొరకదు. ఈ బ్రూటల్ మర్డర్స్ వెనుక ఓ సైకో ఉన్నాడని సీతారాం తెలుసుకుంటాడు. అసలు, గ్రామంలో హత్యలు చేస్తుంది ఎవరు? సైకో కిల్లర్‌ను సీతారాం ఎలా పట్టుకున్నాడు? హత్యలకు గల కారణం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























