అన్వేషించండి

Godzilla X Kong OTT: ఓటీటీకి వచ్చేస్తున్న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Godzilla X Kong OTT Release: ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమా అనేది థియేటర్లలో ఎంజాయ్ చేసిన ఒక విజువల్ వండర్. కానీ దానిని ఓటీటీలో చూడడానికే కొందరు ఎదురుచూస్తున్నారు.

Godzilla X Kong OTT Release Date: ఫిక్షనల్ క్యారెక్టర్లతో హాలీవుడ్.. ఒక మాన్‌స్టర్ యూనివర్స్‌నే సృష్టించింది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మాన్‌స్టర్ యూనివర్స్ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఒకటే ‘గాడ్జిల్లా x కాంగ్’. మార్చి 29న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టీమ్ గాడ్జిల్లా, టీమ్ కాంగ్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయి.. ఇండియాలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ఈ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

45 రోజుల తర్వాతే..

‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ మాత్రమే కాదు.. మాన్‌స్టర్ యూనివర్స్‌లోని ప్రతి సినిమా.. ప్రేక్షకులకు మంచి థియేట్రికిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో విడుదల అవ్వడంతో, 45 రోజుల తర్వాత.. అంటే మేలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా ముందుగా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ రెంట్ తరహాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

స్ట్రీమింగ్ అప్పుడే..

వార్నర్ బ్రోస్ ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాబట్టి వారి సొంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన హెచ్‌బీఓ మ్యాక్స్‌లో కూడా ఈ మూవీ కచ్చితంగా స్ట్రీమ్ అవుతుంది. కానీ ఆ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అనే విషయంపై నిర్మాణ సంస్థ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా థియేటర్లలో ఒక సినిమా విడుదలయిన 60 నుంచి 90 రోజుల తర్వాత హెచ్‌బీఓ మ్యాక్స్.. దానిని ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభిస్తుంది. అలా చూస్తే.. హెచ్‌బీఓ మ్యాక్స్‌లో ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ స్ట్రీమ్ అవ్వాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అంటే మొత్తానికి 2024 మే లేదా జూన్‌లో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.

Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!

ఓపెనింగ్స్‌లో రికార్డ్..

మార్చి 29న బాలీవుడ్ మూవీ ‘క్రూ’కు పోటీగా ఇండియన్ బాక్సాఫీస్ ముందుకు వచ్చింది ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’. అనుకున్న అంచనాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్‌నే సాధించింది ఈ సినిమా. ఇండియా ఏ హాలీవుడ్ చిత్రానికి రాని ఓపెనింగ్‌ను దక్కించుకుంది. రూ.37.60 కోట్లతో ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ మొదటి రోజు కలెక్షన్స్‌ను ముగించింది. రెబెక్కా హాల్, బ్రయన్ టైరీ హన్రీ, డ్యాన్ స్టీవెన్స్, కైలీ హాటిల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్.. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. ఇక 135 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.210 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది.

Also Read: ప్రభాస్ 'కల్కి'పై లేటెస్ట్ అప్డేట్ - ఎన్టీఆర్ చేయాల్సిన పాత్రలో అక్కినేని హీరో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Harish Rao: కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Embed widget