అన్వేషించండి

Udal Movie: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!

డబ్బు మీద వ్యామోహం, వృద్ధుల పట్ల హేయ భావం, పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు కుప్పకూలిపోతాయి. ఇదే పాయింట్ తో తెరకెక్కిన ‘ఉడల్’ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Malayalam Movie Udal Story: కుటుంబం ప్రశాంతంగా గడవాలంటే అవసరాలకు సరిపడ డబ్బు, అంతకు మించి అనుబంధాలు ఉంటే సరిపోతుంది. ఉన్నదాంట్లో సర్దుకుని పోతే సంతోషంగా ఉంటారు. కానీ, డబ్బు మీద వ్యామోహం పెరిగినా, కుటుంబ సభ్యుల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, శారీరక సుఖం కోసం ఎదుటి వారితో సంబంధాలు పెట్టుకున్నా, వృద్దుల విషయంలో దయలేకుండా ప్రవర్తించినా కుటుంబం ఎలా చిన్నాభిన్నం అవుతుందో ‘ఉడల్’ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రతీష్ రఘునందన్. మే 20, 2022లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్, థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హజీబ్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో గోకులం గోపాలన్ నిర్మించిన ఈ సినిమాలో ఇంద్రన్స్, దుర్గా కృష్ణ, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించారు.

‘ఉడల్’ సినిమా కథ ఏంటంటే?

షైనీ(దుర్గా కృష్ణ) రెజీ(జూడ్ ఆంటోనీ జోసెఫ్) భార్య భర్తలు. వారికి 5 సంవత్సరాల కొడుకు జెరిన్(మాస్టర్ కన్నన్) ఉంటాడు. రెజీ సిటీలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటాడు. ఇంటికి డబ్బులు పంపిస్తాడు. ఇంటి దగ్గర తన అత్త, ఒక కన్ను కనిపించని గుడ్డివాడైన మామ కుట్టి ఛాయిన్(ఇంద్రన్స్)తో కలిసి ఉంటుంది. అత్త మంచాన పడుతుంది. తన మామతో కలిసి ఆమెకు చాకిరీ చేస్తుంది.

భర్త దూరంగా ఉండటంతో తన కాలేజ్ మేట్ కిరణ్(ధ్యాన్ శ్రీనివాసన్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తన అత్తకు సేవ చేయాలంటే ఆమెకు విరక్తి కలుగుతుంది. ఇదే విషయాన్ని ఓ రోజు రాత్రి కిరణ్ కు చెప్తుంది. ఎలాగైనా తన అత్తను చంపేయాలని, ఆ బాధతోనే తన మామ కూడా చనిపోతాడని, అప్పుడు ఇద్దరం కలిసి ఇంకా బాగా సరదగా గడపవచ్చని చెప్తుంది.

ప్లాన్ ప్రకారం అదే రాత్రి ఇద్దరు కలిసి వెళ్లి షైనీ అత్త మెడకు టవల్ చుట్టి చంపేస్తారు. పొద్దున్నే తాను అత్తగదిలోకి వెళ్లి గట్టిగా ఏడ్చి ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాలని షైనీ ప్లాన్ వేస్తుంది. ఇంతకీ ఆమె చనిపోయిందో? లేదో? అనే అనుమానంతో మరోసారి తన దగ్గరికి వెళ్లి చూస్తారు కిరణ్, షైనీ. అప్పుడు తన మామ కుట్టిచాయన్ చూస్తాడు. వీళ్లే ఆమెను చంపేశారని తెలుసుకుని ఎలాగైనా వీరిని అంతం చేయాలని భావిస్తాడు. ఇంట్లో కరెంటు ఫ్యూజ్ తీసి, లోపలి నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేస్తాడు.

తాము ముసలావిడను చంపింది మామకు తెలిసిందని షైనీ, కిరణ్ కు అర్థం అవుతుంది. ఎలాగైనా అతడిని చంపాలని భావిస్తారు. కానీ, వారిపై కుట్టి చాయన్ తిరగబడటంతో కిరణ్ తో పాటు ఆయనతో వచ్చిన మిత్రుడు కూడా చనిపోతాడు. షైనీ తీవ్రంగా గాయపడుతుంది. కుట్టిచాయన్ కూడా తీవ్రంగా గాయపడతాడు. పొద్దున్నే పోలీసులు వచ్చి షైనీతో పాటు కుట్టి ఛాయన్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అప్పటికే ఇంటికి చేరుకున్న రెజీ అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరు అవుతాడు.

‘ఉడల్’ సినిమాను ఎక్కడ చూడవచ్చు అంటే?

ప్రేమానురాగాలకు దూరంగా ఉండంటం, డబ్బు కోసమే జీవించడం కారణంగా ఎలాంటి గతి పట్టే అవకాశం ఉందని ఈ సినిమాలో చూపించారు. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగిన ఈ సినిమా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చొబెడుతుంది. A సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను పిల్లలతో కాకుండా ఒంటరిగా చూడడం మంచింది. ఇక ఈ సినిమాకు విలియం ఫ్రాన్సిస్ సంగీతం అందించగా, మనోజ్ పిళ్లై సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రస్తుతం సైనా ప్లే (Saina Play) ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read Also: మనుషులంతా జంతువులుగా మారిపోతే? వామ్మో, ఈ మూవీ మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది - ఒళ్లు గగూర్పాటు కలిగించే స్టోరీ

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget