అన్వేషించండి

Suriya: సూర్య ఫ్లాప్ సినిమాకు సీన్లు, ఫైట్లు యాడ్ చేస్తే చూస్తారా? 'రెట్రో'ని వదలని కార్తీక్ సుబ్బరాజ్

Retro OTT: 'రెట్రో' విడుదలకు ముందు భారీ అంచనాలు ఉండేవి. అయితే సూర్య ఫ్యాన్స్‌నూ పూర్తిస్థాయిలో‌ మెప్పించలేదు. ఇప్పుడీ సినిమాకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తానంటున్నారు కార్తీక్ సుబ్బరాజు.

సినిమా విడుదలైన కొన్ని రోజులకు ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం కోసం దర్శక నిర్మాతలు ఫాలో అయ్యే ఒక టెక్నిక్... సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేయడం! తెలుగులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సహా చాలా సినిమాలకు అలా చేశారు. ఓటీటీ వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ మొదలు అయింది. డైరెక్టర్స్ కట్ పేరుతో థియేటర్లలో ఆల్రెడీ ప్రేక్షకులు చూసిన సినిమాకు యాక్షన్ సీక్వెన్సులు లేదా‌ సన్నివేశాలు‌ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ 'జవాన్'లో ఒక ఫైట్ యాడ్ చేస్తే... సూరి - విజయ్ సేతుపతిల 'విడుదలై' సినిమాను డైరెక్టర్స్ కట్ పేరుతో విడుదల చేశారు వెట్రిమారన్. సూర్య 'రెట్రో' సినిమాకు అదే రూటులో వెళుతున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. 

ఫ్లాప్ సినిమాకు సీన్స్ యాడ్ చేస్తే చూస్తారా?
'రెట్రో' విడుదలకు ముందు సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు ఉండేవి. అయితే మొదటి ఆటకు తమిళ ప్రేక్షకుల నుంచి బిలో యావరేజ్ టాక్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ అయితే ఫ్లాప్ అని తేల్చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాకు పెద్ద  కలెక్షన్లు ఏమీ రాలేదు. నంబర్స్ పరంగా డిజాస్టర్ రిజల్ట్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబితే... 235 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు పోస్టర్ విడుదల చేయడం విమర్శలకు దారి తీసింది. అవన్నీ పక్కన పెడితే... ఇప్పుడు ఈ సినిమాకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేయడానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సన్నాహాలు చేస్తున్నారు.

''ఓటీటీ ప్రతినిధులతో డిస్కషన్స్ చేస్తున్నాను. మూడు లేదా నాలుగు నెలల తరువాత 'రెట్రో' ఎక్స్‌టెండెడ్ వెర్షన్ విడుదల చేయాలనేది ప్లాన్. సినిమాలో నాలుగు ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటి నిడివి సుమారు 40 నిమిషాల ఉంటుంది.  లోతైన భావోద్వేగాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ మరింత డీటెయిల్డ్‌గా ఉంటాయి. భక్తితో పాటు కల్ట్ ఆటకు సంబంధించి మరింత వివరంగా చెప్పాను. హీరో నవ్వు వెనుక కూడా మంచి సన్నివేశాలు ఉన్నాయి. వీటన్నిటితో కలిపి రిలీజ్ చేయాలనేది ప్లాన్'' అని ఓ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజు తెలిపారు.

Also Read: సీక్రెట్‌గా ఉంచాల్సిన విషయాన్ని చెప్పేసిన నాగార్జున - రజనీకాంత్ 'కూలీ' టీమ్ ఏం చేస్తుందో?

'రెట్రో' విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. సూర్య వంద శాతం కష్టపడ్డారని, అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అతని కష్టాన్ని వృథా చేశారని అభిమానులు బాధ పడ్డారు. కారణాలు ఏమిటనేది పక్కన పెడితే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొన్ని సీన్స్ యాడ్ చేయడం వల్ల ఆడియన్స్ మళ్ళీ చూస్తారా? ఓటీటీలో చూసిన నిర్మాతకు లాభం వస్తుందా? అనేది డిస్కషన్ పాయింట్. 

Also Readఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' నచ్చింది... గ్యాంగ్‌స్టర్‌ కామెడీని రీమేక్ చేయాలనుకున్న విష్ణు మంచు! కానీ...


'రెట్రో' రిజల్ట్ పక్కన పెడితే... సూర్య తన తదుపరి సినిమా చిత్రీకరణలో బీజీ అయ్యారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి - నిర్మాత సూర్యదేవర నాగ వంశీతో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అఖిల్ అక్కినేని రిసెప్షన్ వేడుకకు కూడా దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి వచ్చారు సూర్య.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget