By: ABP Desam | Updated at : 12 Mar 2023 03:56 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Rana/Instagram
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది అమెరికన్ డ్రామా సిరీస్ అయిన ‘రే డొనోవన్’ ఆధారంగా తెరకెక్కింది. దీనికి కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. సాధారణంగా విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఆయన సినిమాలు దాదాపు 90 శాతం కుటుంబమంతా కలసి కూర్చొని చూసే సినిమాలే ఉంటాయి. అయితే వెంకటేష్ మొదటిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించారు. దీంతో చాలా మంది ఆయన అభిమానులు ఫ్యామిలీతో కూర్చొని ఈ వెబ్ సిరీస్ చూసేద్దామని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇటీవలే హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్చామని, అయితే దీన్ని ఫ్యామిలీతో కలసి చూడొద్దని, ఎవరికి వారు ఒంటరిగా చూడాలని ప్రకటించారు. దీంతో దీనిపై చర్చ మొదలైంది.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఈ నెల మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్స్ రకకాలుగా స్పందిస్తున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్, ఎమోషన్స్, డ్రామాతో భారీ గానే తెరకెక్కించారు. కానీ ఇందులో బూతు పురాణాలు ఎక్కువగా ఉండటంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎవరికి వారు ఒంటరిగా కూర్చొని చూడమన్నారు బానే ఉంది. కానీ తెలుగు ఆడియన్స్ కు ఆ కుటుంబ పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అంతేకాకుండా ఫ్యామిలీ హీరో వెంకీతో అలాంటి బోల్డ్ డైలాగ్స్ చెప్పిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే వాదన కూడా ఉంది.
Thank you for so much love ❤️❤️❤️ My sincere apologies to the ones who hate 🤗🤗 pic.twitter.com/dUx6MpK8uE
— Rana Daggubati (@RanaDaggubati) March 12, 2023
అలాగే కొన్ని వెబ్ సైట్ లు కూడా ఈ వెబ్ సిరీస్ మొత్తం బోల్డ్ కంటెంట్ అంటూ రాస్తున్నాయి. అయితే తాజాగా వెబ్ సిరీస్ లో హీరో దగ్గుబాటి రానా ట్రోలర్స్ పై స్పందించారు. ఓ నెటిజన్ ‘‘రానా నాయుడు’ టీమ్ ఫ్యామిలీతో ఈ వెబ్ సిరీస్ చూడొద్దని చెప్తే.. కొన్ని వెబ్ సైట్స్ మాత్రం ఇది ఫ్యామిలీ ఆడియన్స్ వ్యతిరేకంలా చూపించారు’’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై రానా స్పందించారు. ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ‘‘కచ్చితంగా ఒంటరిగా చూడాలి, 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే’’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు మీమర్స్ కూడా దీనిపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని మేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Strictly watch alone - 18+ content - A https://t.co/4sjLizjgsh
— Rana Daggubati (@RanaDaggubati) March 12, 2023
ట్రెండింగ్ లో నెంబర్ వన్..
ఇక ఈ వెబ్ సిరీస్ పై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా కూడా ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లిస్ట్ లో ‘రానా నాయుడు’ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. దీంతో ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు, ద్వేషించే వారికి హృదయపూర్వక క్షమాపణలు’’ అంటూ రాసుకొచ్చారు రానా. అయితే ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ ‘‘ఇవన్నీ ఎందుకు గానీ ఫ్యామిలీతో చూసే కంటెంట్ చేయండి’’ అని పెట్టాడు. ఇది చూసిన రానా ‘‘నెక్స్ట్ టైమ్ తప్పకుండా’’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తంగా ‘రానా నాయుడు’ ప్రశంసలు, విమర్శల మధ్య డివైడ్ టాక్ తో నెంబర్ వన్ గా దూసుకుపోతుందనే చెప్పాలి.
Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్
OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Surveen Chawla: ‘రానా నాయుడు’ బ్యూటీ సుర్వీన్ చావ్లా నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా?
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా