Ramnagar Bunny OTT Release Date: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేస్తోన్న ప్రభాకర్ కొడుకు సినిమా - 'రామ్ నగర్ బన్నీ' స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Ramnagar Bunny Locks OTT Date: ఎట్టకేలకు బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. చంద్రహాస్ హీరోగా నటించిన రామ్ నగర్ బన్నీ త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ కానుంది.
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ కలిసి నిర్మించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబివకా వాని, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ లో థియేటర్లో విడుదలైంది. రిలీజ్ కి ముందు తనయుడు కోసం ప్రభాకర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. రివ్యూస్ చూసి సినిమా నచ్చితేనే చూడంటూ ధీమా కూడా వ్యక్తం చేశాడు.
ట్రోలింగ్ తో మూవీ ప్రమోషన్
ప్రమోషన్స్ లో చంద్రహాస్ తీరుపై తీవ్ర నెగిటివిటీ వచ్చింది. అతడి మాటలు, తీరుతో తెగ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. సినిమా రిలీజ్ కు ముందు దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యాడు. దీంతో ట్రోలింగ్ తో చంద్రహాస్ 'యాటిట్యూడ్ స్టార్'గా బిరుదు పొందాడు. చంద్రహాస్ మీద వచ్చిన ట్రోలింగ్ వల్ల అతడి సినిమా కూడా బాగా పాపులర్ అయ్యింది. అదే అతడి సినిమా ప్రమోషన్ కూడా అయ్యింది. దీంతో రామ్ నగర్ బన్నీపై కాస్తా అంచనాలు నెలకున్నాయి. అలా గతేడాది అక్టోబర్ లో ‘రామ్ నగర్ బన్నీ’ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ తర్వాత వారం రోజులకు ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకలేకపోయింది. మూవీకి పెద్దటా టాక్ కూడా లేకపోవగడంతో రామ్ నగర్ బన్నీ కొన్ని రోజుల్లోనే సైలెంట్ థియేటర్లో నుంచి వెనుదిరిగాడు.
ఆహాలో స్ట్రీమింగ్
ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే హిట్ సినిమాలే విడుదలైన నెల రోజులకే ఓటీటీకి వస్తున్నాయి. కానీ రామ్ నగర్ బన్నీ ఓటీటీకి వచ్చేందుకు మూడు నెలల టైం పట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు నోచుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసుకుంది. ఈ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన ఇస్తూ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించింది. జనవరి 17 నుంచి రామ్ నగర్ బన్నీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ సినిమాలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి కీలక పాత్రలు పోషించారు.
Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB
— ahavideoin (@ahavideoIN) January 14, 2025
సినిమా కథ విషయానికి వస్తే
రామ్ నగర్ కాలనీలో ఉండే బన్నీకి అమ్మాయిల వీక్ నెస్ ఉంటుంది. వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తండ్రి కష్టాన్ని పట్టించుకోని బన్నీ అమ్మాయిల చూట్టు తిరుగుతుంటాడు. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. ఒకే టైంలో ముగ్గురు అమ్మాయిలలో ప్రేమాయాణం సాగిస్తాడు. అక్కడితో ఆగకుండ కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లయిన ఆంటీని పెళ్లి చేసుకుంటానని అబద్ధపు మాట ఇస్తాడు. అలా ఆమె కంపెనీలో ఉద్యోగం కొట్టేస్తాడు. ఈ క్రమంలో అతడి శైలు(విస్మయ శ్రీ) నిజంగా ప్రేమిస్తుందని తెలుసుకంటాడు. తన ప్రేమని అర్థం చేసుకుని మారతాడు. కానీ, అప్పటికే ఆమెతో మరొకరితో నిశ్చితార్థం అవుతుంది. ఇటూ తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఓనర్ ని పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పడం, అటూ శైలు ప్రేమలో నిజంగా పడటంతో అతడికి చిక్కులు మొదలవుతాయి. ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు? ఆ ఆంటిని పెళ్లి చేసుకుంటాడా? తన ప్రియురాలిని దక్కించుకున్నాడా? లేదా అనేది మిగత స్టోరీ.
Also Read: 'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?