Pranayam OTT Release Date: సైలెంట్‌గా ఆహాలోకి వచ్చిన కొత్త సినిమా... 70 ఏళ్ళ వయసులో ప్రేమలో పడితే? పెళ్లి చేసుకుంటే?
Jananam 1947 Pranayam Thudarunnu Telugu OTT Release: జయరాజ్ కోజికోడ్, లీలా శాంసన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సినిమా 'జననం 1947 ప్రయాణం తుడరున్ను'. దీనిని తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహా ఓటీటీలో (Aha OTT Movies) ఇవాళ కొత్త సినిమా స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. ఆ మూవీ టైటిల్ 'ప్రణయం' (Pranayam OTT Streaming). పేరు కొత్తగా ఉంది కదా! సినిమా, కథ ఇంకా కొత్తగా ఉంటాయి. అయితే ఇది తెలుగు సినిమా కాదు... మలయాళంలో తీసిన సినిమా. తెలుగు వీక్షకుల కోసం డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేసింది ఆహా. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
ఓల్డ్ ఏజ్ హోమ్ లవ్ స్టోరీ...
70 ఏళ్ల వయసులో ప్రేమలో పడితే?
జయరాజ్ కోజికోడ్, లీలా శాంసన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సినిమా 'జననం: 1947 ప్రణయం తుడరన్ను' (Jananam 1947 Pranayam Thudarunnu). గత ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదల అయింది. కేరళలో ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడీ సినిమాను తెలుగు వీక్షకుల కోసం ఆహా డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'ప్రణయం' కథ విషయానికి వస్తే... అశోక శివన్ (జయరాజ్ కోజికోడ్) వయసు 70 సంవత్సరాలు. ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ (వృద్ధాశ్రమం)లో వివిధ పనులు చేస్తూ ఉంటారు. గౌరీ ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. ఆవిడ వయసు కూడా 70 ఏళ్ళు. వృద్ధాశ్రమంలో ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఆ ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది. 70 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఆహా ఓటీటీలో బుధవారం ఏప్రిల్ 23వ తేదీ నుంచి 'ప్రణయం' (Pranayam OTT Streaming Platform) సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అను సితార, నుబీ మార్కోస్, ఇర్షద్ అలీ, దీపక్ పరంబోల్, కృష్ణ ప్రభ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి అభిజిత్ అశోకన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒరిజినల్ మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read: షైన్ టామ్ చాకోకు FEFKA ఫైనల్ వార్నింగ్... కావాలని చేయలేదంటూ విన్సీకి సారీ చెప్పిన యాక్టర్!
View this post on Instagram





















