Papam Prathap OTT : మరో ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా - రెండు ఓటీటీల్లో తిరువీర్ మూవీ స్ట్రీమింగ్
Papam Prathap OTT Platform : యంగ్ హీరో తిరువీర్ రీసెంట్ కామెడీ డ్రామా పాపం ప్రతాప్ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

Thiruveer's Papam Prathap OTT Streaming On Another Platform : టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా పాపం ప్రతాప్. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుని... 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు తాజాగా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆ రెండు ఓటీటీల్లో...
ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో 'పాపం ప్రతాప్' స్ట్రీమింగ్ అవుతుండగా... తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ అందుబాటులోకి వచ్చింది. సినిమాకు ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించగా... తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించారు. అలాగే, అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు, ప్రసాద్ బెహర, రవి ఆంటోని, గోపరాజు రమణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కేఎం రాధాకృష్ణ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
భార్యాభర్తల మధ్య సాగే చిరు అలకలు, సరదాలు, ఎమోషన్స్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కథ విషయానికొస్తే... సీతారామపురానికి చెందిన వాడు ప్రతాప్ (తిరువీర్). చిన్నప్పటి నుంచీ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఇష్టపడతాడు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. అయితే, ఈ పెళ్లి ప్రతాప్ తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కు ఇష్టం ఉండదు. దీంతో ఇంటి పరువు పోయేలా ఏదైనా చేస్తే చంపేస్తానని కొడుక్కి వార్నింగ్ ఇస్తాడు వీరయ్య.
పెళ్లైన తర్వాత మొదటి 3 రాత్రులు గడిచిన తర్వాత ప్రతాప్‌కు సమస్య ఉందంటూ పంచాయతీ పెడుతుంది బుజ్జమ్మ. అతనిలో సమస్య ఏంటో అతనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెబుతుంది. అయితే, ఆ సమస్య ఏంటి అనేది మాత్రం పెద్దలకు చెప్పదు. దీంతో ప్రతాప్‌పై ఊరి వాళ్లకు లేని పోని సమస్యలు వస్తాయి. తన సమస్య ఏంటో తెలుసుకునేందుకు ప్రతాప్ ఏం చేశాడు? ఇంతకీ అతని సమస్య ఏంటి? పెళ్లైన 3 రోజులకే ఎందుకు బుజ్జమ్మ ఎందుకు పంచాయతీ పెట్టింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : Sangeeth Sobhan : సంగీత్ శోభన్‌తో 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రొడ్యూసర్ - డైరెక్టర్ ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























