అన్వేషించండి

Veerabhadruni Rahasyam Series OTT : ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' - 90s సెన్సేషన్ మర్మదేశం సీక్వెల్‌... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Veerabhadruni Rahasyam OTT Platform : 90s ఫేమస్ సీరియల్ మర్మదేశం గుర్తుండే ఉంటుంది. దీనికి సీక్వెల్‌‌గా 60 ఎపిసోడ్స్‌తో సరికొత్తగా వీరభద్రుని రహస్యం ఓటీటీలోకి రాబోతోంది.

Veerabhadruni Rahasyam Series OTT Release Date Locked : 'ఒక జనరేషన్‌ను భయపెట్టిన కథ... మరో జనరేషన్‌ను వణికించడానికి మళ్లీ వస్తోంది.' అదే లేటెస్ట్ థ్రిల్లింగ్ మిస్టరీ స్టోరీ వీరభద్రుని రహస్యం. 1990ల్లో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్ట్ మిస్టరీ సీరియల్ 'మర్మదేశం'. దీనికి సీక్వెల్‌గా ఆ వరల్డ్ నుంచి 'వీరభద్రుని రహస్యం' ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. 

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

తెలుగు టాప్ ఓటీటీ ZEE5 ప్లాట్ ఫామ్ ఈ థ్రిల్లింగ్ మిస్టరీ సిరీస్‌ స్టోరీని స్ట్రీమింగ్ చేయనుంది. జూన్ 26 (శుక్రవారం) నుంచి సిరీస్ అందుబాటులోకి రానుంది. 1990ల్లో టీవీల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మర్మదేశం మళ్లీ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పట్లో ఈ సీరియల్... ఐఎండీబీ హయ్యస్ట్ రేటింగ్ సాధించి హైప్ క్రియేట్ చేసింది.

రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో.. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి.. భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడిపై ఉన్న ప్రగాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈ కథలో వెలుగులోకి రాబోతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Also Read : Tamannaah Bhatia : హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటుంటుంది - సౌత్ ఇండస్ట్రీపై మిల్కీ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

ఈ సిరీస్‌కు భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, అభినవ్‌గా ఎస్‌ఐ రవి, డా.నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష‌, నాంచారిగా అనురాధ, గురునాధన్‌గా బాలచంద్ర, బ్రహ్మంగా కల్కి, యంగ్ కార్తికేయగా హార్విన్ రెడ్డి క‌నిపించ‌నున్నారు.

క్రియేటివ్ టీమ్ విష‌యానికి వ‌స్తే సినిమాటోగ్రఫీకి సుభాష్, సంగీత దర్శకుడిగా సుధా శ్రీనివాస్, ఎడిటర్‌గా రాగం సత్య నితీష్, స్క్రీన్‌ప్లే రచయితగా రుద్రరాజు చాణక్య వర్మ, సంభాషణల రచయితగా అంజన్ మేగోటి పని చేశారు. మొత్తం 60 ఎపిసోడ్‌లతో రూపొందిన 'వీరభద్రుని రహస్యం' ఒక లాంగ్-ఫార్మ్ మిస్టరీగా క్రమంగా రహస్యాలు, ట్విస్టులను బయటపెడుతూ ముందుకు సాగుతుంది. జూన్ 26న రెండు ఎపిసోడ్‌లతో ప్రారంభమై త‌ర్వాత‌ ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతాయి.

స్టోరీ ఏంటంటే?

తరతరాలుగా వీరభద్రపురం గ్రామస్థులు తమ గ్రామ దైవం వీరభద్రస్వామి అండలో జీవిస్తుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తాడని అందరూ గాఢంగా నమ్ముతుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా... ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు క‌నిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు. అయితే, వాటి వెనుక నిజం ఏంటో అని మాత్రం ప్రశ్నించడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు. త‌ర‌త‌రాలు వారంద‌రూ పాటిస్తున్న సాంప్ర‌దాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొన‌సాగేలా చేస్తుంది. దీంతో వారు బ‌ల‌వంతంగా, ద‌శాబ్దాలుగా అక్క‌డి ప్ర‌జ‌లు ఆ సాంప్ర‌దాయాన్ని పాటిస్తుంటారు.

మూఢ నమ్మకాలతో నిండిన వింత ప్రపంంచలోకి సిటీ నుంచి ధైర్యమున్న, విషయాన్ని తార్కికంగా ఆలోచించే యువతి వెన్నెల (అన్నీ) అడుగుపెడుతుంది. ఆమె వ‌చ్చిన స‌మ‌యంలో గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గుర‌వుతాడు. అయితే అక్క‌డి ప్ర‌జ‌లు దాన్ని దైవ శిక్షగా చెబుతారు. కానీ వెన్నెల మాత్రం వారి అంధ విశ్వాసాన్నిఒప్పుకోదు. నిజాన్ని వెలికితీయాలనే ఆమె సంకల్పం గ్రామాన్ని కుదిపేస్తుంది, శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాల్ చేస్తుంది, గతాన్ని దాచి పెట్టాలని చూసే శ‌క్తివంతులైన వ్య‌క్తుల‌తో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది. అసలు అనీ ఆ రహస్యాన్ని ఛేదించిందా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Also Read : Singer Sunitha : ఫిల్మ్ ఇండస్ట్రీ మహిళలకు నాట్ సేఫ్ - సింగర్ సునీత సెన్సేషనల్ కామెంట్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget