Anaganaga Paid Shows: ఓటీటీ నుంచి థియటర్లకు సుమంత్ 'అనగనగా'... స్పెషల్ షోస్ వేసే థియేటర్స్, టైమింగ్స్ తెల్సా?
Anaganaga Theaters List: థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలలోకి రావడం కామన్. బట్ ఫర్ ఏ చేంజ్, ఓటీటీలో విడుదలైన 'అనగనగా' సినిమా థియేటర్లలోకి వస్తోంది.

థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ వేదికల్లోకి సినిమాలు రావడం కామన్. బట్ ఫర్ ఏ చేంజ్... సుమంత్ కథానాయకుడిగా రూపొందిన 'అనగనగా' ముందుగా ఓటీటీలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
విజయవాడ, విశాఖ నగరాల్లో స్పెషల్ షోస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సినిమా 'అనగనగా'. ఈ సినిమాను 'గోదావరి', 'మళ్లీ రావా' సినిమాల కేటగిరిలో వేశారు ప్రేక్షకులు. ఆ సినిమాలలో సుమంత్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అని పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు 'అనగనగా' కూడా అటువంటి సినిమా అంటున్నారు. ఈ మూవీ చూసి కంటతడి పెట్టుకున్నామని చాలా మంది చెబుతున్నారు.
స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం గురించి తల్లితండ్రులకు మెసేజ్ ఇచ్చేలా రూపొందించిన సినిమా 'అనగనగా'. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక మంచి స్పందన రావడంతో ఇప్పుడు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. శనివారం (మే 24వ తేదీ) సాయంత్రం ఏడున్నర గంటలకు క్యాపిటల్స్ సినిమాస్'లో ఒక పెయిడ్ షో వేస్తున్నారు. ఆదివారం మే 20వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు విశాఖలోని జగదాంబ థియేటర్‌లో మరొక షో వేస్తున్నారు. ఈ రెండు షోలకు వచ్చిన స్పందన బట్టి మరిన్ని థియేటర్లలో సెలెక్టివ్‌గా షోస్ వేసే ఆలోచనలో ఉన్నారు.
View this post on Instagram
'అనగనగా' చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన కొన్ని యూట్యూబ్ సిరీస్‌లు చేశారు. కార్పొరేట్ స్కూల్ కల్చర్ పెరిగిన తర్వాత పిల్లలకు కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పడం కంటే... మార్కుల కోసం బట్టి పట్టిస్తున్నారని, అది సరైన పద్ధతి కాదనే సందేశాన్ని ఈ సినిమాలో ఇచ్చారు. సుమంత్ సరసన కాజల్ చౌదరి నటించిన చిత్రమిది. ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సుమంత్ తెలిపారు. మొత్తం మీద ఈ సినిమాతో సుమంత్ మరో విజయం అందుకున్నారు. దీని తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది.
Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసిన మీట్‌లో అడవి శేష్ పాల్గొన్నారు. తాను సినిమా చూసి గంట తడి పెట్టుకున్నట్లు చెప్పారు. తన కోసం బిగ్ స్క్రీన్ మీద షో వేయమని కోరారు. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇదని ఆయన చెప్పారు. దర్శకుడు సన్నీ సంజయ్ మంచి కథతో వస్తే సినిమా చేయడానికి తాను సిద్ధమని అడివి శేష్ చెప్పారు. అయితే తనతో సినిమా చేయాలంటే కొంత సమయం పడుతుందని సరదాగా వ్యాఖ్యానించారు.





















