Niharika Konidela: లక్ష్మీ మంచు కాదు... ఈసారి నిహారిక కొణిదెల
Niharika Konidela Aha Show: ఆహా ఓటీటీ కోసం నిహారిక కొణిదెల ఓ షో చేస్తున్నారు. లక్ష్మీ మంచు హోస్ట్ చేసిన షో లేటెస్ట్ సీజన్ ఆమె చేస్తుండటం విశేషం!
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) కథానాయికగా యూట్యూబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ / షోలు, సినిమాలు చేశారు. ఈ విషయం తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆమెలో నటితో పాటు మంచి హోస్ట్ కూడా ఉన్నారు. ఓసారి చిరంజీవి, రామ్ చరణ్... ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు. సన్నిహితుల కోసం మధ్య మధ్యలో సినిమా టీంలతో కొన్ని ఇంటర్వ్యూలు చేశారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓటీటీ కోసం నిహారిక ఓ షో చేశారు.
లక్ష్మీ మంచు కాదు... ఈసారి నిహారిక
Niharika Konidela Chef Mantra: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో 'షెఫ్ మంత్ర' రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఫస్ట్ సీజన్ హోస్ట్ చేస్తే... రెండో సీజన్ లక్ష్మీ మంచు హోస్ట్ చేశారు. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది. దీనిని నిహారిక కొణిదెల హోస్ట్ చేయనున్నారు. ఆ విషయాన్ని ఆహా అనౌన్స్ చేసింది.
లక్ష్మీ మంచు హోస్ట్ చేసిన 'షెఫ్ మంత్ర 2'లో ఒక ఎపిసోడ్‌కి నిహారిక కొణిదెల అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఏకంగా షో హోస్ట్ చేసే ఛాన్స్ తన సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో కొత్తదనం కోసం ప్రతి సీజన్ కొత్త వారితో చేయించాలని అనుకోవడం వల్ల హోస్ట్ మార్పు జరిగింది తప్ప... మరొకటి ఏమీ కాదని తెలిసింది.
Also Read: హారర్ సినిమాలో బెల్లంకొండ - ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్?
Mana @IamNiharikaK ki vanta cheyatam ocha 🤔? Pasta order cheskuntunda lekpothe tane prepare cheskuntunda🫢? Stay Tuned for fun conversations and juicy gossip with your favorite Tollywood celebs only on aha - Chef Mantra Season 3🫢.
— ahavideoin (@ahavideoIN) February 24, 2024
Grand Launch Episode on 03-Mar 😍😍… pic.twitter.com/MNkw69cqxt
మార్చి 3 నుంచి 'షెఫ్ మంత్ర 3' షురూ!
బహుశా... 3ను లక్కీ నెంబర్ అని 'షెఫ్ మంత్ర' టీం భావిస్తున్నట్లు ఉంది. ఇది మూడో సీజన్ అని ప్రేక్షకులకు తెలుసు. ఏడాదిలో మూడో నెల... మార్చిలో, అదీ మూడో తారీఖున షో గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేశారు. మరి, ఈ కార్యక్రమానికి అతిథులు ఎవరెవరు వస్తారు? అనేది త్వరలో తెలియనుంది.
Also Read: పేరు ఎలా మారిందో చెప్పిన తమన్నా - రాజమౌళి ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం ఇవ్వలేదట!
Fun conversations and juicy gossips brought to you by @IamNiharikaK exclusively from 03-Mar on aha Chef Mantra Season 3.
— ahavideoin (@ahavideoIN) February 25, 2024
This season is all about fun, games and delicious recipes 😍#ChefMantraSeason3 #ChefMantraOnaha #ChefMantra @FreedomOil_In #Easykitchen #Hatsun #ValueZone… pic.twitter.com/NEF2TpZWTF
ఇప్పుడు నీహారిక చేస్తున్న సినిమాలకు వస్తే... తెలుగులో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ 'వాట్ ద ఫిష్' సినిమా చేస్తున్నారు. అది కాకుండా మరో మలయాళ సినిమా ఓకే చేశారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, విడాకుల తర్వాత నటన, నిర్మాణం మీద నీహారిక ఫోకల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.