అన్వేషించండి

Nagendran’s Honeymoons: మతాలు మారుస్తూ అయిదుగురితో పెళ్లి, చివరికి ఊహించని ట్విస్ట్ - ఈ లేటెస్ట్ మలయాళ వెబ్ సిరీస్‌ చూశారా?

Nagendran’s Honeymoons: డబ్బు కోసం చాలామంది చాలా చేస్తుంటారు. ఈ హీరో కూడా మతం మారుస్తూ, పేర్లు మారుస్తూ అయిదుగురిని పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి తాను తవ్విన గోతిలో తానే పడ్డాడు.

Nagendran’s Honeymoons Web Series: మలయాళ కంటెంట్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకుల మందుకొస్తున్నారు మలయాళ మేకర్స్. తాజాగా ఓటీటీలో విడుదలయిన ఒక కామెడీ వెబ్ సిరీస్.. ఆడియన్స్‌ను తెగ ఇంప్రెస్ చేస్తోంది. అదే ‘నాగేంద్రన్స్ హనీమూన్స్’. ఫస్ట్ లుక్ నుండే అందరిలో ఆసక్తి క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్.. విడుదలయిన తర్వాత కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతోంది.

కథ..

‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ కథ విషయానికొస్తే.. నాగేంద్రన్ ఒక పనిపాట లేని సోమరిపోతు. తన తల్లి వృద్ధురాలు అయినా కూడా ఆమె సంపాదనతోనే జీవనం కొనసాగిస్తుంటాడు. అదే సమయంలో కువైట్ నుండి తన స్నేహితుడు తిరిగొస్తాడు. తన స్నేహితుడి లైఫ్‌స్టైల్ చూసి తాను కూడా కువైట్‌కు వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. కానీ కువైట్ వెళ్లాలంటే రూ.17 వేలు సిద్ధం చేసుకోమని తన స్నేహితుడు.. నాగేంద్రన్‌కు చెప్తాడు. తన మామ కూతురు అయిన జానకి (అల్ఫీ పంజికారన్)ను పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందనే ఆశతో తనను పెళ్లి చేసుకుంటాడు. కానీ తన మామ తనకు కట్నం ఏమీ ఇవ్వడు. దీంతో తన ఫ్రెండ్ సోమన్ (ప్రశాంత్ అలెక్సాండర్)తో కలిసి వేరే ఊరికి పారిపోతాడు నాగేంద్రన్.

పోలీస్ ఆఫీసర్ అయిన వర్కే (కళాభవన్ షాజాన్).. తన చెల్లి లిల్లీకుట్టీ (గ్రేస్ ఆంటోనీ)ని పెళ్లి కావడం లేదని బాధపడుతూ ఉంటాడు. లిల్లీకుట్టీ కూడా తన పెళ్లి గురించే ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోతుంది. దీంతో ఆ ఊరికి వెళ్లిన సోమన్.. నాగేంద్రన్‌కు జోసెఫ్ అని పేరు మార్చి, తను అనాథ అని చెప్పి లిల్లీకుట్టితో పెళ్లి చేస్తాడు. పెళ్లయిన మరుసటి రోజే తన మామయ్యకు బాలేదని చెప్పి వర్కే దగ్గర నుండి కొంత డబ్బు తీసుకొని వెళ్లిపోతాడు నాగేంద్రన్. మరొక ఊరిలో పేదరికంలో ఉన్న ముస్లిం అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రభుత్వం పెళ్లి చేసి డబ్బులిస్తుంది అని తెలుసుకొని తన పేరును ఆలీ జోసెఫ్ లాగా మార్చుకొని లైలా సుల్తానా (శ్వేతా మీనన్)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ వచ్చిన డబ్బును లైలానే తీసుకుంటుంది. దీంతో తనకు దొరికిన డబ్బుతో సోమన్‌తో కలిసి అక్కడి నుండి పారిపోతాడు నాగేంద్రన్.

నాగేంద్రన్, లైలా సుల్తానా పెళ్లి ఫోటో పేపర్‌లో రావడంతో అది వర్కే కంటపడుతుంది. దీంతో నాగేంద్రన్ కోసం వెతకడం మొదలుపెడతాడు. అప్పటికే ఒక ఊరిలో ఉన్న సావిత్రి (నిరంజనా అనూప్) అనే బ్రాహ్మణ అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు నాగేంద్రన్. పెళ్లయిన రోజు రాత్రి ఆ ఇంటి నుండి పారిపోదామనుకునే సమయంలో సావిత్రి అప్పటికే ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటాడు. దీంతో తనకు కొంత డబ్బు ఇచ్చి ఆ ఇంటి నుండి వెళ్లిపోతాడు. మరో ఊరికి వెళ్లి అక్కడ ఉన్న వేశ్య అయిన తంగం (కనీ కుస్రుతి)ని పెళ్లి చేసుకుంటాడు. తంగంను పెళ్లి చేసుకుంటే ఆ ఊరిలో కుర్రాళ్లు డబ్బులిస్తామని నాగేంద్రన్‌కు మాటిస్తారు. కానీ ఆ డబ్బును కూడా తంగం తీసేసుకుంటుంది. చివరిగా మొరి (అమ్ము అభిరామి) అనే అమ్మాయితో జరిగే పెళ్లితో నాగేంద్రన్ జీవితం మలుపుతిరుగుతుంది. అదేంటో తెరపై చూడాల్సిందే.

యాక్టింగ్ సూపర్..

‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ వెబ్ సిరీస్ కేవలం 6 ఎపిసోడ్లు మాత్రమే ఉంటుంది. ఆ 6 ఎపిసోడ్లు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫాస్ట్‌గా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక చివరిగా వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులకు నచ్చేలాగానే ఉంటుంది. ఇందులో నాగేంద్రన్ పాత్రలో నటించిన సూరజ్‌తో పాటు తన భార్యల పాత్రలో నటించిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించారు. ఒక మంచి స్టోరీకి మంచి యాక్టింగ్ కూడా యాడ్ అవ్వడంతో ఈ వెబ్ సిరీస్.. అందరి ప్రశంసలు అందుకుంటోంది. మీరు కూడా ఒక కామెడీ వెబ్ సిరీస్‌ను చూడాలనుకుంటే ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ఉన్న ‘నాగేంద్రన్ హనీమూన్స్’ను స్ట్రీమ్ చేసేయండి.

Also Read: స్కూల్లో పిల్లలను సీలింగ్‌లోకి లాగేసే దెయ్యం - వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఇండోనేషియన్ మూవీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget