Money Heist Korea: ‘మనీ హీస్ట్’ కొరియా డేట్ ఫిక్స్, ప్రొఫెసర్‌గా యూ జీ-టే, ఫస్ట్ లుక్ చూశారా?

పాపులర్ టీవీ షో ‘మనీ హీస్ట్’ ఇప్పుడు కొరియాలో రీమేక్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ షో రిలీజ్ డే‌తోపాటు ప్రొఫెసర్ ఫస్ట్ లుక్‌ను నెట్ ఫ్లిక్స్ కొరియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

FOLLOW US: 

‘మనీ హీస్ట్’ వెబ్ సీరిస్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే. స్పానిష్‌‌కు చెందిన ఈ షో తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదలైంది. ఐదు సీజన్లతో ఈ షోను ముగించారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, కొరియాలో మళ్లీ ‘మనీ హీస్ట్’‌ను రీమేక్ చేస్తున్నారు. స్పానిష్ ‘మనీ హీస్ట్’లో అల్వారో మోర్టే పోషించిన ప్రొఫెసర్ పాత్రలో యూ జీ-టే నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్ కొరియా’ ప్రొఫెసర్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. 

మరో గుడ్ న్యూస్ ఏమిటంటే ‘Money Heist: Korea – Joint Economic Area’ సీజన్-1‌.. జూన్ 24 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజనల్ ‘మనీ హీస్ట్’లో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ వెబ్ సీరిస్ అభిమానులు అందులోని పాత్రల గురించి నిద్రలో అడిగినా తడబడకుండా చెప్పేస్తారు. ప్రొఫెసర్‌తోపాటు బెర్లిన్, టోక్యో, రియో, హెల్సింకీ, నైరోబీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ ప్లాన్స్.. ఏ క్షణంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడనేవి ఎవరికీ అంతుబట్టకుండా ఉంటాయి. అందుకే ఈ షో అందరికీ నచ్చేసింది.

Also Read: ఓటీటీలో RRR వచ్చేది ఈ తేదీనే, అదనంగా నగదు చెల్లించాలా?

మరి, ‘మనీ హీస్ట్’ కొరియాలో అదే కథను మళ్లీ చూపిస్తారా? లేదా ఏమైనా మార్పులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఇది ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’లో విడుదల అవుతుందా లేదా అనేది కూడా సందేహమే. అయితే, ఇండియాలో కొరియా వెబ్ సీరిస్‌లకు మంచి ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

Also Read: మహేష్ 'సర్కారు వారి పాట' ఓటీటీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

View this post on Instagram
 
A post shared by Netflix Korea (@netflixkr)

Tags: Money Heist Korea Money Heist Korea Release date Money Heist Korea Professor Yoo Ji-tae Alvaro Morte

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ఓటీటీ రిలీజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ఓటీటీ రిలీజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Siddharth: ఆ రోజు వస్తే యాక్టింగ్ మానేస్తా - హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు

Siddharth: ఆ రోజు వస్తే యాక్టింగ్ మానేస్తా - హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు