By: ABP Desam | Updated at : 12 May 2022 10:13 AM (IST)
మహేష్ బాబు, పరశురామ్
Sarkaru Vaari Paata On Amazon Prime Video OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట' ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ప్రైమ్ వీడియో అని థియేటర్లలో ప్రదర్శించారు.
ఓటీటీలో 'సర్కారు వారి పాట' ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో విడుదల అవుతోంది. మరోవైపు, 'రాధే శ్యామ్' థియేటర్లలో విడుదలైన 20 రోజులకు వచ్చింది. థియేట్రికల్ రన్ మీద ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే... 'సర్కారు వారి పాట' స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. అదీ ఓటీటీలో విడుదలైన తర్వాతే! ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. ఆ ఛానల్ లోగో కూడా 'సర్కారు వారి పాట' టైటిల్ కార్డ్స్‌లో పడింది. సినిమాలో కొత్త మహేష్ బాబు కనిపించారని విమర్శలు, ప్రేక్షకులు చెబుతున్నారు. థియేటర్ల దగ్గర సినిమాకు వస్తున్న స్పందనపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక. తమన్ సంగీతం అందించారు.
Also Read: బ్యాడ్ టైమ్‌లో పూజా హెగ్డేకు గుడ్ న్యూస్, బుట్ట బొమ్మకు అరుదైన ఆహ్వానం
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం