Modern Love Hyderabad Web Series: నలుగురు దర్శకులు, ఆరు కథలు, 11 మంది నటీనటులు - 'హైదరాబాద్ మోడ్రన్ లవ్'
'మోడ్రన్ లవ్ హైదరాబాద్' - అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందిన కొత్త వెబ్ సిరీస్! ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
![Modern Love Hyderabad Web Series: నలుగురు దర్శకులు, ఆరు కథలు, 11 మంది నటీనటులు - 'హైదరాబాద్ మోడ్రన్ లవ్' Modern Love Hyderabad Web Series Abhijeet Aadhi Nitya Menon Starrer Modern Love Hyderabad To Stream On Amazon from July 8th Modern Love Hyderabad Web Series: నలుగురు దర్శకులు, ఆరు కథలు, 11 మంది నటీనటులు - 'హైదరాబాద్ మోడ్రన్ లవ్'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/22/42963f4292fe560d0ab92e5ca6eba0d3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నలుగురు పేరు పొందిన దర్శకులు... ఆరు భిన్నమైన కథలు... మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పదకొండు మంది నటీనటులు... త్వరలో ఓటీటీలో ఆసక్తికరమైన యాంథాలజీ వెబ్ సిరీస్ ప్రజల ముందుకు వస్తోంది.
రేవతి, నిత్యా మీనన్ (Nithya Menon), ఆది పినిశెట్టి, రీతూ వర్మ, 'బిగ్ బాస్' అభిజిత్ (Bigg Boss Abhijeet), మాళవిక నాయర్ (Malavika Nair), సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ ప్రధాన తారలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధనం దర్శకత్వం వహించారు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
జూలై 8 నుంచి 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కాలమ్‌లో వచ్చిన వాస్తవ కథనాల ప్రేరణతో ఈ సిరీస్ రూపొందించామని తెలియజేసింది. SIC ప్రొడక్షన్స్ (ఫిల్మ్) ప్రొడక్షన్ పతాకంపై ఎలాహే హిప్టూలా ఈ సిరీస్ నిర్మించారు. దీనికి నగేష్ కుకునూర్ షో రన్నర్.
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)