The Family Man Season 3 Teaser: 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 సర్‌ప్రైజ్ వచ్చేసింది - కొత్త శత్రువుతో వార్ షురూ...
The Family Man Season 3: మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. కొత్త వార్ షురూ అన్నట్లుగా టీం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.

Manoj Bajapayee's The Family Man Series Season 3 Teaser: ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మోస్ట్ పవర్ ఫుల్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 రెడీ అయ్యింది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కొత్త సీజన్ స్పెషల్ వీడియోను 'అమెజాన్ ప్రైమ్' తాజాగా రిలీజ్ చేసింది.
వీడియో అదుర్స్
కొత్త సీజన్ ఎలా ఉండబోతోందో ఓ చిన్న హింట్ ఇచ్చేలా యాక్షన్ సన్నివేశాలను ఓ చిన్న వీడియోలో చూపించారు. ముందు సీజన్ల గురించి ప్రస్తావిస్తూనే మూడో సీజన్ గురించి చూపించారు. ట్రైన్‌లో ఓ వ్యక్తి శ్రీకాంత్ తివారీని (మనోజ్ బాజ్‌పేయ్) 'మీరేం చేస్తుంటారు సార్?' అని అడిగితే సిగ్గు పడుతూ... 'లైఫ్ అండ్ రిలేషన్ షిప్ కౌన్సిలర్' అంటూ ఆన్సర్ ఇస్తాడు. అది విని అతని భార్య సుచిత్ర (ప్రియమణి) నవ్వుకుంటుంది. ఆ తర్వాత కొత్త శత్రువుతో పోరాటం షురూ అనేలా యాక్షన్ సీన్స్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ స్పెషల్ వీడియోలో నిమ్రత్ కౌర్ కొద్దిసేపు కనిపించగా... టీజర్ చివర్లో జైదీప్ అహ్లావత్ ముఖానికి మాస్క్‌తో కనిపించారు.
ఈ సిరీస్‌ను డీ2 ఫిల్మ్ బ్యానర్‌లో రాజ్, డీకే రూపొందించగా... సుమన్ కుమార్ కూడా కొత్త సీజన్ రచనలో భాగమయ్యారు. స్పై పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తుండగా ఆయన భార్య రోల్‌లో ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, జైదీప్ అహ్లావత్, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా, గుల్ పనాగ్, సన్నీ హిందూజా, అభయ్ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'ది ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ రెండు సీజన్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సిరీస్ ఓటీటీలో అత్యంత ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. పాత సీజన్లకు మించి కొత్త సీజన్‌ను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
స్టోరీ ఏంటి?
థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ (TASC) లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పని చేసే శ్రీకాంత్ తివారీ బృందం ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడం ఫస్ట్ సీజన్‌లో చూపించారు. ఆ తర్వాత వచ్చిన సీజన్‌లో తమిళ టైగర్స్ నుంచి ఎదురైన దాడిని ఎలా తిప్పికొట్టారో చూపించారు. సీజన్ 2లో స్టార్ హీరోయిన్ సమంత నెగిటివ్ రోల్‌లో నటించారు. తమిళ టైగర్స్ తరఫున పోరాటం చేసే మహిళగా కనిపించారు. ఇక ముచ్చటగా మూడో సీజన్ కూడా రెడీ అయిపోయింది.
ఈ కొత్త సీజన్‌లో ఈశాన్య రాష్ట్రాలపై చైనా దాడులను ఎలా ఎదుర్కొన్నారు? కొవిడ్ 19 తదితర అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై చైనా కుట్రలను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ టీం ఎలా ఎదుర్కొంది? ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించనున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ ఏడాది చివర్లో సిరీస్ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.





















