Shefali Jariwala: 'కాంటా లగా' సాంగ్ ఫేం షఫాలీ మృతి! - అసలు రీజన్ ఏంటంటే?
Kaanta Laga Shefali: 'కాంటా లగా' సాంగ్ ఫేం షఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kaanta Laga Song Fame Shefali Jariwala Passed Away: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'కాంటా లగా.. హై రాజా' సాంగ్ ఫేం, హీరోయిన్ షఫాలీ జరివాలా (42) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా... ఆమె భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరిలోని బెల్లేవ్యూ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్స్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కన్ఫర్మ్ చేయని ఫ్యామిలీ మెంబర్స్
షఫాలీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, షఫాలీ మృతి విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆమె మృతి పట్ల సింగర్ మికా సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షఫాలీ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
'కాంటా లగా'తో పాపులర్
2002లో వచ్చిన ఆశా పరేఖ్ చిత్రంలోని 'కాంటా లగా' సాంగ్‌తో షఫాలీ బాగా పాపులర్ అయ్యారు. ఈ సాంగ్ పాప్ కల్చర్‌కు సంచలనంగా మారగా... ఒక్క పాటతోనే యూత్ మనసు దోచేశారు. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌కు అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఈమెను ఫ్యాన్స్ 'కాంటా లగా' గర్ల్ అంటూ ముద్దు పేరుతో పిలుస్తుంటారు. ఈ సాంగ్ క్రేజ్‌తో ఆమె ఇండస్ట్రీలోనూ ఛాన్సెస్ దక్కించుకున్నారు. సల్మాన్ ఖాన్ మూవీ 'ముజ్సే షాదీ కరోగా' మూవీలో ఆమె ఓ రోల్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత టీవీ రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13లోకి ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్‌తో సినిమా తర్వాత ఆమె మరో హిందీ సినిమా చేయలేదు. 2015లో పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 డ్యాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షఫాలీకి ఇన్ స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తెలుగు సినిమాల్లో పరాగ్ త్యాగి
షఫాలీ భర్త పరాగ్ త్యాగి యూపీకి చెందిన వారు. టీవీ రియాలిటీ షోస్, సినిమాలకు ఆయన పని చేశారు. 2009లో వచ్చిన జీటీ పవిత్ర రిష్త సీరియల్‌తో వినోద కరంజ్ కర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 2016లో వచ్చిన 'బ్రహ్మరాక్షస్'లోనూ నటించారు. ఈయన తెలుగు సినిమాల్లోనూ మెరిశారు. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'లో సెక్యూరిటీ క్యారెక్టర్ చేశారు. వెంకటేష్ 'వెంకీ మామ' సినిమాలో కనిపించారు. బాలకృష్ణ రూలర్, మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాల్లోనూ కనిపించారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి
షఫాలీ మరణంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ ఆమె మృతిపై సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ పోస్ట్ చేశారు. తన స్నేహితురాలు షఫాలీ మరణ వార్తతో తన గుండె బరువెక్కిందని... ఇంకా నమ్మలేకపోతున్నట్లు ప్రముఖ సింగర్ మికా సింగ్ సోషళ్ మీడియాలో పోస్ట్ చేశారు.



















