Lal Salaam OTT Release Date: 'లాల్ సలాం' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... థియేటర్లలో చూసిన సినిమా కాదు... ఎక్స్‌టెండెడ్ వెర్షన్
Lal Salaam OTT Platform: సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సన్ నెక్స్ట్ సంస్థ. బక్రీద్ సందర్భంగా జూన్ తొలి వారంలోనే డిజిటల్ తెరమీదకు సినిమాను తీసుకు రానుంది.

నో మోర్ వెయిటింగ్ పీరియడ్... అతి త్వరలో, అది కూడా జూన్ తొలి వారంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన 'లాల్ సలాం' సినిమాను డిజిటల్ తెర మీదకు సన్ నెక్స్ట్ ఓటీటీ (Lal Salaam OTT) సంస్థ తీసుకు వస్తోంది. ఇవాళ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
జూన్ 6వ తేదీన లాల్ సలాం స్ట్రీమింగ్!
Sun Nxt OTT announces Lal Salaam digital streaming date: 'లాల్ సలాం' డిజిటల్ తెర మీదకు ఎప్పుడు వస్తుంది? అసలు ఈ సినిమా ఏ ఓటీటీలో వస్తుంది? నెట్‌ఫ్లిక్స్ సంస్థ సినిమాను ఎందుకు స్ట్రీమింగ్ చేయడం లేదు? వంటి ప్రశ్నలకు సమాధానం లభించింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీతో ముందు అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ... హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వంటి కొన్ని అంశాల వల్ల ఆ డీల్ క్యాన్సిల్ అయింది. సన్ నెక్స్ట్ ఓటీటీ లాల్ సలాం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.
జూన్ 6వ తేదీన బక్రీద్ సందర్భంగా 'లాల్ సలాం' సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్స్ట్ సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది. అది కూడా సినిమా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న విషయాన్ని మే 30వ తేదీన వెల్లడించింది. మర్నాడు ఓటీటీ రిలీజ్ డేట్ తెలియజేసింది.
Also Read: మనోజ్ మనుషుల పనే... 'కన్నప్ప' హార్డ్ డిస్క్ చోరీలో తమ్ముడిపై విష్ణు మంచు అనుమానం
View this post on Instagram
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలాం' సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించారు. గత ఏడాది ఫిబ్రవరి 9న థియేటర్లలో సినిమా విడుదల కాగా... ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రొడక్షన్ కోసం ఆల్మోస్ట్ 90 కోట్లు ఖర్చు చేయగా కేవలం 19 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్స్ రూపంలో రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడాలని కోరుకునే ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు థియేటర్లలో చాలా మంది చూడలేదు కనుక ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 16 నెలలకు ఓటీటీలోకి వస్తుండడం విశేషం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.






















