R Narayana Murthy: డిప్యూటీ సీఎంగా పవన్ అలా చేయడం కరెక్ట్ కాదు... థియేటర్స్ బంద్ ఇష్యూలో నారాయణ మూర్తి సెన్సేషనల్ కామెంట్స్
R Narayana Murthy On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీరు సరికాదని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

థియేటర్స్ బంద్ అంటూ ఎవరూ అనౌన్స్ చేయలేదని పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ఒకవేళ ఎగ్జిబిటర్లు బంద్ చేయాలని అనుకుంటే మూడు వారాల ముందు నోటీసులు ఇస్తారని ఆయన వివరించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీరు సరికాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి 'హరి హర వీరమల్లు' గురించి స్పందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు?
'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ముందు థియేటర్స్ బంద్ చేయాలని ఆ నలుగురు నుంచి ఎగ్జిబిటర్స్ మీద ఒత్తిడి వచ్చినట్లు వినపడుతోందని వాటిపై విచారణ చేయాలని కందుల దుర్గేష్ ఏపీ హోం సెక్రటరీని ఆదేశించిన సంగతి తెలిసిందే. వీరమల్లపై కుట్ర చేశారని ఎలా అంటారని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు.
రెంటల్ సిస్టం వద్దని పర్సంటేజీ విధానం తీసుకురావాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్న సంగతి తెలిసిందే. పర్సెంటేజీ విధానానికి నారాయణ మూర్తి ఓటు వేశారు. దయచేసి పర్సంటేజ్ సిస్టం తీసుకురావాలని పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటే తీసుకోవాల్సిన మార్పుల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సినిమా బడ్జెట్స్ బట్టి టికెట్ రేట్స్ పెంచడం సరికాదని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. అప్పట్లో 'మొఘల్ ఏ ఆజం', 'బెన్ హర్' వంటి సినిమాలకు పెంచలేదని గుర్తు చేశారు.
Also Read: శ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్
ప్రజల దగ్గరకు రాజులు వచ్చేవారు... ఇప్పుడు?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవలేదని పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ అంశం గురించి ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ... ''పూర్వం ప్రజల దగ్గరకు రాజులు వచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు రావాలని అడగటం ఏమిటి?'' అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డికి థాంక్స్... ఏపీలోనూ అవార్తులు!
గద్దర్ అవార్డులు ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణ మూర్తి థాంక్స్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులను తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలు సినీ ప్రముఖులకు ఉత్సాహాన్ని భరోసాను ఇస్తాయని ఆయన వివరించారు.
Also Read: ఆస్కార్ విన్నర్ డైరెక్షన్‌లో దిశా పటానీ... హాలీవుడ్ డెబ్యూ ప్లానింగ్ మామూలుగా లేదుగా





















