Sreeleela: శ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్
Sreeleela Viral Photo: ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీ లీల కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫంక్షన్ పిక్చర్స్ చూసి చాలామంది ఆవిడకు నిశ్చితార్థం జరిగిందని భావించారు. అసలు మ్యాటర్ ఏమిటో తెలుసా?

యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) వయస్సు 23 సంవత్సరాలు మాత్రమే. ఇండస్ట్రీలో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి పట్టుమని పదేళ్లు కూడా కాలేదు. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు? అని ఆడియన్స్ చాలా మంది షాక్ అయ్యారు. అందుకు కారణం... ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శ్రీల షేర్ చేసిన ఒక వీడియో, అలాగే ఫోటోలు. వాటిని చూసి చాలా మంది ఆవిడకు నిశ్చితార్థం జరిగిందని భావించారు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.
వైరల్ ఫోటోల వెనుక కహానీ!
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'బిగ్ డే టుడే' అంటూ ఒక వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు శ్రీ లీల. ఆ తర్వాత కమింగ్ సూన్ అంటూ మరికొన్ని ఫోటోలు షేర్ చేశారు. అది చూస్తే ఇంట్లో ఫంక్షన్ జరిగినట్టు అర్థం అవుతోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది ఆవిడకు నిశ్చితార్థం జరిగిందని భావించారు. అసలు విషయం ఏమిటంటే...
జూన్ 14వ తేదీన శ్రీ లీల పుట్టినరోజు (Sreeleela Birthday). అయితే... హిందూ సంప్రదాయం, తిథి ప్రకారం కొన్ని రోజులు ముందు పుట్టినరోజు వస్తుంది. శ్రీ లీల తల్లికి తిథి ప్రకారం పుట్టినరోజు సెలబ్రేట్ చేసే అలవాటు ఉంది. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను, సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులను పిలిచి తిథి రోజున బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. శుక్రవారం కూడా అలాగే చేశారు. అది వైరల్ ఫోటోలు వెనక కహాని.
Also Read: ఆస్కార్ విన్నర్ డైరెక్షన్‌లో దిశా పటానీ... హాలీవుడ్ డెబ్యూ ప్లానింగ్ మామూలుగా లేదుగా
Sreeleela Upcoming Movies: శ్రీ లీల ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు వస్తే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆవిడ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా షెడ్యూల్‌లో ఆవిడ కూడా జాయిన్ అవుతారు. తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'జాతర', కన్నడలో గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న 'జూనియర్', హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన 'ఆషిఖీ 3', తెలుగులో మరో సినిమా 'లెనిన్', తమిళంలో శివ కార్తికేయన్ 'పరాశక్తి' సినిమాల్లో శ్రీ లీల నటిస్తున్నారు.
Also Read: హార్డ్ డిస్క్ దొరికేసింది... ఫైనల్లీ, పదహారు నెలల తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా





















