Laggam Time OTT : ఓటీటీలోకి సడన్‌గా రొమాంటిక్ కామెడీ మూవీ - 'లగ్గం టైమ్' వెంటనే చూసెయ్యండి
Laggam Time OTT Platform : రీసెంట్ తెలుగు రొమాంటిక్ మూవీ లగ్గం టైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రెండున్నర నెలల తర్వాత సడన్ స్ట్రీమింగ్ అవుతోంది.

Rajesh Meru's Laggam Time OTT Streaming : కొన్ని సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో... ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా చాలామందికి తెలియదు. కొత్త నటీనటులు, ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. అలాంటి మూవీస్‌లో ఒకటి 'లగ్గం టైమ్'. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
దాదాపు రెండున్నర నెలల తర్వాత 'లగ్గంటైమ్' ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో రాజేశ్ మేరు, నవ్య చిట్యాల ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేజోత్ కె వెన్నం దర్శకత్వం వహించగా... నెల్లూరు సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. కె.యశ్వంత్ కుమార్ సమర్పణలో 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె హిమబిందు నిర్మించారు. థియేటర్లలో అంతగా రాణించలేకపోయిన మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read : లావణ్య త్రిపాఠి సతీ లీలావతి రిలీజ్ డేట్ ఫిక్స్ - ట్రెండీ సెన్సిటివ్ ఇష్యూ చూడాల్సిందే...
స్టోరీ ఏంటంటే?
పెళ్లి నేపథ్యానికి కాస్త క్రైమ్ కామెడీని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. అనన్య (నవ్య చిట్యాల), చంద్ర (సుదర్శన్)ల వివాహ వేడుకతో ఈ కథ మొదలవుతుంది. అనన్య మాజీ లవర్ సూర్య (రాజేష్ మేరు) తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను పెళ్లి పీటల మీద నుంచే ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే, పెళ్లింట్లో జరిగిన అనుకోని ఘటనతో అక్కడి నుంచి పరారవుతారు. అదే రోజున తనకు ఇంటర్వ్యూ ఉండడంతో సూర్య అక్కడకు వెళ్తాడు.
ఇదే టైంలో పెళ్లి కొడుకు చంద్రను ఎవరో కిడ్నాప్ చేస్తారు. పోలీసులు ఇంటర్వ్యూలో ఉన్న సూర్యనే కిడ్నాప్ చేశాడంటూ అతన్ని అరెస్ట్ చేస్తారు. అసలు చంద్రను కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో జరిగిన లవ్ స్టోరీకి, ఈ కిడ్నాప్ వెనుక ఉన్న సంబంధం ఏంటి? సూర్య, అనన్యలు కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























